• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NITHIIN CHANDRA SEKHAR YELETI CHECK MOVIE OTT RELEASE DATE ANNOUNCED HERE ARE THE DETAILS TA

Nithiin: నితిన్ ‘చెక్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

నితిన్ ‘చెక్’మూవీ (Twitter/Photo)

Nithiin: నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

  • Share this:
    Nithiin: నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి శిక్ష టైమ్‌లో చెస్ ఆడి గెలిచిన ఓ అమెరికన్ ఖైదీ కథ అని చంద్రశేఖర్ యేలేటి చెప్పుకొచ్చారు. ఐతే.. తెలుగు ఆడియన్స్‌ను మెప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్.. లాయర్ పాత్రలో నటించారు. రెండవ హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను మే 14 శుక్రవారం నుంచి సన్ నెక్ట్స్ లో ప్రసారం కానుంది. థియేటర్స్‌లో సరిగా ఆడని ఈ సినిమా ఓటీటీలో హిట్ అవుతుందేమో చూడాలి. మరోవైపు నితిన్, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రంగ్ దే’ సినిమా మే 21న  జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలు ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: