• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NITHIIN CHANDRA SEKHAR YELETI CHECK MOVIE FIRST WEEK COLLECTIONS TA

Nithiin Check Movie First Week Collections: ‘చెక్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన నితిన్..

Nithiin Check Movie First Week Collections: ‘చెక్’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన నితిన్..

‘చెక్’ మూవీ ఫస్ట్ వీక్ కలెెక్షన్స్ (Twitter/Photo)

Nithiin Check Movie First Week Collections: నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయిన సందర్భంగా ఈ సినిమా మొత్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..

  • Share this:
    Nithiin Check Movie First Week Collections: నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చిత్రం చెక్. చెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజే సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో కలెక్షన్స్‌పై కూడా ప్రభావం పడింది. ఫస్ట్ డే కేవలం 3.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసిన చెక్.. ఆ తర్వాత రెండు రోజుల్లోనూ అంతే తక్కువ వసూళ్లను తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా దారుణంగా చెక్ వసూళ్లు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేసింది చెక్. వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ వీకెండ్ టోటల్ కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. దాంతో నితిన్‌కు మరో భారీ ఫెయిల్యూర్‌గా చెక్ నిలవబోతుంది. దాదాపు 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరచడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

    మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తంగా ఎంత వసూళ్లను సాధించిదంటే.. నైజాం (తెలంగాణ)లో ఈ సినిమాకు రూ. 3.20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 0.96 కోట్లను రాబట్టింది. మిగిలిన ఏపీలో రూ. 5.78 కోట్లను రాబట్టింది. మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి రూ. 8.02 కోట్లను రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 0.31 కోట్లు, ఓవర్సీస్.. 0.68కోట్లను మాత్రమే రాబట్టగలిగింది. మొత్తంగా రూ. 9.01 కోట్లను రాబట్టింది. మొత్తంగా పదిహేడు కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.  7 నుంచి రూ. 8 కోట్ల వరకు రాబట్టాలి. ఈ సినిమాకు వచ్చిన టాక్ చూస్తుంటే.. అంత వసూలు చేయడం ఈజీ కాదనే చెప్పాలి. ఈ వీకెండ్‌లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. మొత్తంగా చెక్ మూవీ నితిన్ కెరీర్‌లో మరో డిజాస్టర్ మూవీగా నిలిచిపోవడం ఖాయం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు