హ్యాపీ బర్త్ డే నితిన్.. మరో ఎంటర్టైనర్‌గా రంగ్ దే..

రంగ్ దే టీమ్ Photo : Twitter

యువ హీరో నితిన్ ఈరోజు తన 37వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం రంగ్ దే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.

  • Share this:
    యువ హీరో నితిన్ ఈరోజు తన 37వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం రంగ్ దే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. భీష్మ తర్వాత ఆయన నుండి వస్తోన్న మరో ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్నులకు దర్శకత్వం వహించాడు. ఇది ఆయనకు మూడో సినిమా. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తిచేసుకుంది. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా రంగ్ దే‌కు సంబందించి నిన్న సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. నితిన్ భీష్మ చిత్రాన్ని నిర్మించిన సంస్థే ఈ రంగ్ దే చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

    ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలలో నితిన్ నటిస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కిస్తున్న చిత్రంలో నితిన్ నటిస్తుండగా రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్‌లు ఆయనకు జంటగా నటిస్తున్నారు. అలాగే మరో యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక మూవీ చేస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: