హోమ్ /వార్తలు /సినిమా /

అయ్యోపాపం.. పెళ్లికి ముందే నితిన్‌కు కొత్త కష్టాలు..

అయ్యోపాపం.. పెళ్లికి ముందే నితిన్‌కు కొత్త కష్టాలు..

భీష్మ పోస్టర్ Twitter

భీష్మ పోస్టర్ Twitter

Bheeshma :  నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో భీష్మ అనే రొమాంటిక్ కామెడీ వస్తోన్న సంగతి తెలిసిందే.

Bheeshma :  నితిన్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో భీష్మ అనే రొమాంటిక్ కామెడీ వస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 21న విడుదలకావడానికి సిద్దమవుతోంది. 'భీష్మ'ను సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్ మార్చాలనీ కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మహాభారతానికి మూల పురుషుడు, ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడి పేరుతో కామెడీ సినిమాను రూపొందించడంపై బీజేపీ ధార్మిక సెల్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భీష్మ అనే పేరుతో సినిమా విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కోన్నారు. దీనికి సంబందించి సోమవారం హైదర్‌గూడలో ధార్మిక సెల్‌ కన్వీనర్‌ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము, ఇతర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. భీష్మ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. భీష్ముడు పేరు పెట్టి సినిమాలో హీరోను లవర్‌ బాయ్‌గా చూపించడం బాధాకరమని తెలుపుతూ... ఒకవేళా చిత్రబృందం మా డిమాండ్ మేరకు టైటిల్‌ మార్చకుంటే ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు వీలైతే కోర్టును ఆశ్రయించేందుకు సైతం వెనుకాడమని తెలిపారు. ఈ నెల 21న విడుదలకానున్న ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుంది.


తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ అనుకున్నట్లుగానే ఆద్యంతం కామెడీ సీన్స్‌తో ఆకట్టుకుంటోంది. కాగా ఇంతకు ముందే టీజర్, ఫస్ట్ లుక్‌లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందని టాక్. అంతేకాదు చిత్ర నిర్మాతలకు రిలీజ్‌కు ముందే మంచి లాభాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌ను చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 45 కోట్లు

ఆంధ్ర - 8 కోట్లు

సీడెడ్ - 2 కోట్లు

మిగతా ప్రాంతాలు - 5.5 కోట్లు

నాన్-థియేట్రికల్ - 15 కోట్లు

టోటల్ ప్రీరిలీజ్ బిజినెస్ - 35 కోట్లు

First published:

Tags: Bheeshma

ఉత్తమ కథలు