Bheeshma : నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రష్మిక మందన హీరోయిన్‌గా వచ్చిన చిత్రం భీష్మ. ఈ నెల 21వ తేదిన శివరాత్రి సందర్భంగా విడుదలై ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దర్శకుడు వెంకీ కుడుముల అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజు నైజాం లో 2.21 కోట్ల షేర్ రాబట్టిన భీష్మ... అదే ఊపును విడుదలైనప్పటి రోజు నుండి కొనసాగిస్తూ.. అదరగొడుతోంది. రెండో రోజు భీష్మ దాదాపు 5.0కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి రెండు రోజుల్లోనే భీష్మ 13.03కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టి షాక్ ఇచ్చింది. భీష్మ అటు ఓవర్సీస్‌లో కూడా అదరగొడుతోంది. దీంతో అక్కడ ఆరు కోట్లకు పైగా వసూళ్లు వచ్చిన ట్లు సమాచారం. కాగా భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. మొదటి ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది. భీష్మకు మొదటి నుండి పాజిటివ్ వైబ్ ఉండడంతో పాటు సరైన ప్రమోషన్స్ చేసిన చిత్రబృందం సినిమాను జనాల్లోకి వెళ్లేట్టు చేసింది. దీనికి తోడు నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ అదరడం, ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, పంచ్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, ఇలా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉండటంతో పాటు మరే సినిమా విడుదల లేకపోవడం భీష్మ సినిమాకు కలిసివస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా మొదటి వారంలో ఈ సినిమా 24.00 కోట్ల షేర్‌ను 50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
#BlockbusterBheeshma first week collections worldwide - Break Even done in all areas👍
👉 Gross - ₹50CR's
👉 Share - ₹24CR's+@actor_nithiin @iamRashmika @VenkyKudumula @mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @adityamusic @SitharaEnts #Bheeshma pic.twitter.com/0ash0dwRDc
— trendy tolly (@urstanay) February 28, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheeshma