నితిన్ (Nithiin ) హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం(macherla niyojakavargam ). ఈ సినిమాలో కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు యం యస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.. అయితే మాచర్లతో దెబ్బ తిన్న నితిన్.. ఈ కొత్త సినిమా పట్ల జాగ్రత్తగా ఉంటున్నాడట. అందులో భాగంగా స్క్రిప్ట్‌పై మరింత శ్రద్ధ వహిస్తున్నారట. ఏలాగైన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనీ అటు నితిన్, వక్కంతం వంశీ కసిగా పనిచేస్తున్నారట.
ఇక ఈ సినిమా అలా ఉండగానే నితిన్ తాజాగా మరో సినిమాను ప్రకటించారు. మరోసారి నితిన్, వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. భీష్మ తర్వాత రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నితిన్ సరసన నటిస్తోంది. ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీనికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి అందించనున్నారు. ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
#VNRTrio is back with something more entertaining and more adventurous ???????? Watch now! - https://t.co/BEG0The5vL More details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @MythriOfficial pic.twitter.com/9jzTtHAzcb
— G.V.Prakash Kumar (@gvprakash) March 22, 2023
ఇక నితిన్ గత చిత్రం మాచర్ల నియోజకవర్గం విషయానికి వస్తే.. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మాచర్ల నియోజకవర్గం వరల్డ్ వైడ్‌గా 2022 ఆగస్టు 12న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nithiin, Venky Kudumula