Home /News /movies /

NIRUPAM PARITALAS HITLER GAARI PELLAM IS STARTING ON AUGUST 17TH ZEE TELEVISION MK

హిట్లర్ గారి పెళ్లాం ప్రసారానికి సిద్ధం...ఆగస్టు 17 నుంచి బుల్లితెరపై బంపర్ రిలీజ్...

టీవీ యాక్టర్ నిరుపమ్ (కార్తీకదీపం ఫేమ్) (Facebook Photo)

టీవీ యాక్టర్ నిరుపమ్ (కార్తీకదీపం ఫేమ్) (Facebook Photo)

ఈ సీరియల్ ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకి జీ తెలుగు, అలాగే జీ తెలుగు హెచ్‌డీలలో ప్రారంభం కానుంది.

    జీ తెలుగులో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిట్లర్ గారి పెళ్లాం ప్రసారం అవడానికి సిద్ధమైపోయింది. నిరుపమ్ పరిటాల టైటిల్ పాత్రధారిగా నటిస్తున్న ఈ సీరియల్ ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకి జీ తెలుగు, అలాగే జీ తెలుగు హెచ్‌డీలలో ప్రారంభం కానుంది. హిట్లర్ గారి పెళ్ళాం లో అభినవ్ గా, టెలివిషన్ శోభన్ బాబు గా పిలవబడే నిరుపమ్ పరిటాల హీరో గా నటిస్తుండగా. నిరుపమ్ అభిమానులు తన 'హిట్లర్' వేషధారణకి ఇప్పటికే మంత్రముగ్ధులై పోయారు. ఈ సీరియల్ ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.



    అలాగే, భానుమతి పాత్రలో గోమతి ప్రియా నటిస్తోంది. వీరితో పాటు, సునంద మాలశెట్టి, కీర్తి జై ధనుష్, మధుకృష్ణ తదితరులు ముఖ్య పాత్రలలో ప్రేక్షకులని అలరింపచేయనున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Telugu tv serials

    తదుపరి వార్తలు