NIRUPAM PARITALA ANNOUNCES HIS NEW SHOW HITLER GARI PELLAM SET TO SPORT A NEW LOOK IN THE SHOW MK
హిట్లర్ గా మారిపోయిన...వంటలక్క మొగుడు...అసలు సంగతి ఇదే...
(Image: Facebook)
వంటలక్కకు కష్టాలు తెచ్చిపెట్టడంలో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుదే ప్రధాన పాత్ర. అందుకే మహిళా ప్రేక్షకులకు కార్తీక్ కేరక్టర్ అంటే అంత కోపం. అతడిని హిట్లర్ లాగా చూస్తారు. అయితే కార్తీక్ కు హిట్లర్ అనే పేరు నిజంగానే సార్థకం చేసేలా మరో కొత్త సీరియల్ జీ తెలుగులో ప్రారంభం కానుంది.
కార్తీక దీపం సీరియల్ దేశంలోనే టాప్ సీరియల్ గా రేటింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది. అందులోని కేరక్టర్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఇంట్లోనూ కనెక్ట్ అయిపోయాయి. ముఖ్యంగా టైటిల్ లీడ్ రోల్ చేస్తున్న వంటలక్క అలియాస్ దీప అంటే మహిళలకు చచ్చేంత ఇష్టం అనే చెప్పాలి. అయితే వంటలక్కతో కనెక్ట్ అయిన ప్రతీ కేరక్టర్ కూడా జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. వంటలక్క తర్వాత అదే స్థాయంలో ఆమె భర్తగా నటించిన డాక్టర్ బాబు, అలియాస్ కార్తీక్ కూడా జనాల్లో బాగా పేరు తెచ్చకున్నారు. అయితే కార్తీక్ పాత్రపై మహిళా ప్రేక్షకులకు బాగా కోపం అనే చెప్పాలి. వంటలక్కకు కష్టాలు తెచ్చిపెట్టడంలో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుదే ప్రధాన పాత్ర. అందుకే మహిళా ప్రేక్షకులకు కార్తీక్ కేరక్టర్ అంటే అంత కోపం. అతడిని హిట్లర్ లాగా చూస్తారు. అయితే కార్తీక్ కు హిట్లర్ అనే పేరు నిజంగానే సార్థకం చేసేలా మరో కొత్త సీరియల్ జీ తెలుగులో ప్రారంభం కానుంది.
టైటిల్ కేరక్టర్ హిట్లర్ పాత్రలో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీరియల్ జీ తెలుగులో త్వరలో ప్రారంభం కానుంది. కొత్త లుక్ లో డాక్టర్ బాబు అదరగొట్టేశాడు. కొత్త సీరియల్ హిట్లర్ గారి పెళ్లాంలో నిరుపమ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. టీజర్ లోనే అతడు హిట్లర్ అని చెప్పకనే చెప్పేశాడు. చాలా రిచ్ లుక్ తో కనిపిస్తున్న ఈ సీరియల్, ప్రేక్షకాదరణ కోసం ఎదురు చూస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.