Karthika Deepam: వంటలక్క గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డాక్టర్ బాబు.. ఏం అన్నారంటే?

Nirupam Paritala

Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. క్షణం కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ అవ్వట్లేరు. రేటింగ్ విషయంలో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంది.

  • Share this:
    Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. క్షణం కూడా ఈ సీరియల్ ను అసలు మిస్ అవ్వట్లేరు. రేటింగ్ విషయంలో కూడా ఈ సీరియల్ మొదటి స్థానంలో ఉంది. పైగా సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు అభిమానులుగా మారారు. ఇక ఇందులో నటించే కార్తీక్, దీప, సౌందర్య, మోనితల పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఎంత ఆసక్తిగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇందులో డాక్టర్ బాబు ఒకప్పుడు వంటలక్కను ఎలా బాధపెట్టాడో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అలాంటి బాధనే కార్తీక్ ఎదురుకుంటున్నాడు. కానీ వంటలక్క మాత్రం డాక్టర్ బాబును అనుమానించడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా వంటలక్క గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు డాక్టర్ బాబు.

    డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న నిరుపమ్ పరిటాల.. ప్రస్తుతం బుల్లితెరలో స్టార్ హీరోగా నిలిచాడు. కార్తీకదీపం సీరియల్ తో పాటు జీ తెలుగులో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. ఇక నిరుపమ్ ఇదివరకే బుల్లితెర శోభన్ బాబు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఎన్నో సీరియల్ లో నటించిన నిరుపమ్ కు కార్తీకదీపం సీరియల్ తో తన కెరీర్ మొత్తం మలుపు తిరిగింది.

    అంతేకాకుండా వెండితెరపై కూడా హీరోగా అవకాశాలు కూడా రావడంతో తనకు డేట్స్ కుదరకపోవడం వల్ల అవకాశాలను వదులుకున్నాడు. బుల్లితెరలో కూడా పలు సీరియల్స్ ను కూడా వదులుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ముందుంటాడు. తన ఫోటోలను, తనపై వచ్చిన మీమ్స్ ను బాగా షేర్ చేసుకుంటాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కార్తీకదీపం సీరియల్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

    ఈ సీరియల్ లో ప్రస్తుతం తను బాధపడుతున్న సన్నివేశాలు తనకు చాలా హ్యాపీ అని తెలిపాడు. ఎందుకంటే మగవాళ్ళు కూడా ఏడవడం వల్ల సీరియల్ పై ఇంత అభిమానం ఉంటుందని అనుకోలేదట. ఈ సీరియల్ లో ప్రస్తుతం తను దీపతో ఉంటున్న విధానం తనకు ఏమి ఓవర్ గా అనిపించడం లేదని తెలిపాడు. కానీ ఒకప్పుడు దీప తన దగ్గరికి వచ్చి తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా కాస్త ఓవర్ గా చేశానంటూ.. నిజానికి పాత్రనే అలాంటిది అంటూ తెలిపాడు. ఇక ప్రస్తుతం వంటలక్క పై తను చూపిస్తున్న కేరింగ్ ను అలాగే ఉండాలని ప్రేక్షకులు అనుకుంటున్నారని తెలిపాడు. కానీ అప్పుడే అంత ఓవర్ కేరింగ్ ఉండకూడోద్దని అన్నాడు డాక్టర్ బాబు.
    Published by:Navya Reddy
    First published: