హోమ్ /వార్తలు /సినిమా /

Nirupam Paritala: దీపను ఒప్పుకుంటే నాకు గుడి కట్టేస్తారా ఏంటి..?

Nirupam Paritala: దీపను ఒప్పుకుంటే నాకు గుడి కట్టేస్తారా ఏంటి..?

Nirupam Paritala

Nirupam Paritala

Nirupam Paritala: డైలీ సీరియల్ లో ఏదైనా జరగని సంఘటన, ఊహించని సంఘటన ప్రసారమవుతే.. అవి చివరికి కలలాగా చూపిస్తుంటారు. ఇదంతా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడానికి చేస్తుంటారు.

Nirupam Paritala: డైలీ సీరియల్ లో ఏదైనా జరగని సంఘటన, ఊహించని సంఘటన ప్రసారమవుతే.. అవి చివరికి కలలాగా చూపిస్తుంటారు. ఇదంతా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడానికి చేస్తుంటారు. తాజాగా ఓ సీరియల్ లో అలా జరుగుతుందని కలలో కూడా ఊహించుకోని ప్రేక్షకులను.. ఏంటి ఇది కలనా అన్నట్లుగా సీన్ చేయగా.. కల కాదు అది నిజమని తెలియక ప్రేక్షకుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇంత సీరియల్ ఏదో కాదు..

తెలుగు రాష్ట్రాలలో 7:30 అయిన వెంటనే ఎంతపని ఉన్నా వాటిని వదులుకొని మరి చూసే సీరియలే కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లను పూర్తి చేసుకోగా.. ఈ సీరియల్ ను చూసే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ రేటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్ రోజు రోజుకి ఉత్కంఠగా మారగా.. తాజాగా ప్రసారమైన ఒక సీన్ చూసిన అభిమానులను.. నాకు గుడి కట్టేస్తారా అని కార్తీక్ మాటలు ఆశ్చర్య పరిచాయి.

ఈ సీరియల్ లో దీప ఆరోగ్యం రోజు రోజు క్షీణించిపోతుందన్న విషయం బుల్లితెర పరిచయం ఉన్న ప్రేక్షకులకు తెలిసిందే. ఇక ఇందులో దీప ఆరోగ్యం అసలు బాగోలేనందున.. కార్తీక్ ఈమధ్య దీప పై కాస్త ప్రేమను చూపిస్తున్నాడు. తనకు వైద్యం చేయించడానికి కార్తీక్ ముందుకు వస్తే, తన ట్రీట్మెంట్ కి సహకరిస్తానని దీప చెప్పేసింది. ఇక ఇదివరకు డాక్టర్ చెప్పిన మాటలు ప్రకారం దీప టాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటే పరిస్థితి తీవ్రంగా మారుతుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో దీప కార్తీక్ ఓ సన్నివేశంలో ఎమోషనల్ గా మాట్లాడుతున్న సందర్భంలో వెంటనే వారిద్దరిని ముద్దాడుకునే సీన్ చేయించాడు సీరియల్ డైరెక్టర్. ఇక దీప కార్తీక్ ని కౌగిలించుకొని తెగ ముద్దాడగా.. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇది కల అయితే కాదు కదా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ సీరియల్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్లను ఇచ్చే కార్తీక్ ( నిరూపమ్) తాజాగా ఈ సన్నివేశం గురించి ఓ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. అది కూడా " దీపని ఆక్సెప్ట్ చేశానన్న ఆనందంలో నాకు గుడి కట్టేసారా ఏంటి.. పూజలు, పాలాభిషేకాలు, హారతులు.. అమ్మో.. జనాలకి అంత పని పెట్టకూడదు. అసలే కోవిడ్ టైమ్.. సర్వేజనా మాస్కులే దిక్కు" అని తన ఫోటో తో సహా షేర్ చేయగా ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది.


Deepa ni accept chesananna aanandam lo naaku gudi kattestara enti... poojalu, palaabhishekaalu,harathulu... ammooo......

Posted by Nirupam paritala on Thursday, April 15, 2021


ఇది చూసిన నెటిజనులు ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ, నీరసం వచ్చేసింది త్వరగా ముగించండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు పాపం మోనిత అంటూ తెగ కామెంట్ లను నింపేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి హగ్ చేసుకున్న ఫోటోలను తెగ ట్రోల్ కూడా చేస్తున్నారు.

First published:

Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka

ఉత్తమ కథలు