హోమ్ /వార్తలు /సినిమా /

నేచర్ మూవీ.. ఆలీ చేతుల మీదుగా నిన్నే చూడందే లిరికల్ సాంగ్ లాంచ్

నేచర్ మూవీ.. ఆలీ చేతుల మీదుగా నిన్నే చూడందే లిరికల్ సాంగ్ లాంచ్

Ali Photo News 18

Ali Photo News 18

Nature Movie: శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణ , ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో నేచర్ మూవీ తెరకెక్కింది. తాజాగా ఆలీ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి సాంగ్ లాంచ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది నేచర్ (Nature). ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ "నేచర్" కథాంశం. శ్రీ సప్తమ్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ పతాకంపై కృష్ణ (Krishna), ముస్కాన్ (Muskan) రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి.యశోదమ్మ, టి. చేతన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వినాయక చవితి సందర్బంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రం లోని "నిన్నే చూడందే" లిరికల్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కమెడియన్ అలీ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు కృష్ణుడు, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, కమెడియన్ గౌతమ్ రాజులతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.అనంతరం పాత్రికేయుల సమావేశంలో కమెడీయన్ అలీ మాట్లాడుతూ.. ''గౌతమ్ రాజు నేను ఎవరి సపోర్ట్ లేకుండా తన స్టైల్ లో తను, నా స్టైల్ లో నేను ఎదిగి ఇండస్ట్రీ లో సెట్లయ్యాము. అలాగే నేచర్ సినిమా టైటిల్ బాగుంది. నేచర్ బాగుంటే మనందరం బాగుంటాము. నాకు ఇళయరాజా పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట చూస్తుంటే నాకు ఇళయరాజా పాటలు గుర్తుకువస్తున్నాయి. యం. యల్ రాజా అద్భుతమైన మ్యూజిక్ చేశాడు లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో హీరోయిన్స్ కూడా సాంగ్ లో చాలా బాగా నటించారు. కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది. నేచర్ టైటిల్ పెట్టి ఆ నేచర్ లో సినిమా చెయ్యడం అంటే ఆషామాసి కాదు. ఆ నేచర్ లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఆ మధ్య మనం చూశాము. నేచర్ కొరకు వెళ్లిన కొందరు స్టూడెంట్స్ ఉన్న డ్యామ్ లొకి ఆకస్మాత్తుగా నీరు వచ్చి చాలా మంది చనిపోయారు. అందుకే పెద్దలు నీరు, నిప్పు, గాలికి దూరంగా ఉండాలని చెపుతారు. అలాంటిది వీరు ఈ సినిమాను ఇక్కడే షూటింగ్ చేసుకోకుండా తలకోన వెళ్లి షూటింగ్ చేయడం చాలా గ్రేట్. అలాంటి ప్లేస్ లో ఎంతో హార్డ్ వర్క్ చేసిన టెక్నిషియన్స్ కు థాంక్స్ చెప్పాలి. హీరో కృష్ణ లాంటి ట్యాలెంట్ ఉన్న నటుడుకు సపోర్ట్ ఇస్తే నటుడుగా పైకి వస్తాడు అన్ని నమ్మి ప్రకృతి సంబందించిన మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని చేస్తున్న నిర్మాతలకు, దర్శకునికి ఈ సినిమా 'రామ్ తేరా గంగా మైలీ' అంతటి బిగ్ హిట్టు అవ్వాలి'' అన్నారు.


దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇద్దరు టీచర్స్ రాసిన కథే ఈ "నేచర్. నిన్నే చూడందే లిరికల్ సాంగ్ చూస్తుంటే ఇందులో మ్యూజిక్, ట్యూన్, బ్యాక్ డ్రాప్ గానీ చాలా బాగుంది. గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కు ఇది ఆరవ సినిమా. తను మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. తను ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను. యం. యల్ రాజా మ్యూజిక్ చాలా బాగుంది. నేచర్ వంటి మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రం దర్శక, నిర్మాతలకు మంచి పేరుతో పాటు సినిమా పెద్ద విజయం సాదించాలి'' అన్నారు.
చిత్ర దర్శకుడు అశ్విన్ కామరాజు కొప్పల మాట్లాడుతూ.. ''ఆలీ గారు ఎంతో బిజీగా ఉన్నా మా ఈవెంట్ కు వచ్చి లిరికల్ వీడియోను విడుదల చేసిన అలీ గారికి ధన్యవాదములు. ఇప్పుడు మీరు చూసిన ప్రతి సీన్ ప్రతి షార్ట్ సినిమాలో ఇలానే ఉంటుంది. ప్రకృతి ని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ వల్ల తను ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేదే "నేచర్" చిత్ర కథాంశం. నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు'' అన్నారు.

First published:

Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema

ఉత్తమ కథలు