హోమ్ /వార్తలు /సినిమా /

Nikhil : హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం..

Nikhil : హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం..

హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం (Twitter/Photo)

హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం (Twitter/Photo)

Nikhila | హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..  2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు.

Nikhil | హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్ధ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూసారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నిఖిల్ కుటుంబ సభ్యులకు అభిమానులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్ధ కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక  2022 కూడా చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ  కాన్సర్‌తో కన్నుమూస్తే.. ప్రముఖ దర్శకుడు శరత్ కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. రీసెంట్‌గా ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణ దాస్ నారంగ్‌తో పాటు తెలుగు సహా హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు తుది శ్వాస విడిచారు. తాజాగా నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్ధ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

Mahesh Babu - Pokiri@16Years: మహేష్ బాబు ‘పోకిరి’కి 16 ఏళ్లు.. ఫైనల్‌గా ఎంత కలెక్ట్ చేసిందంటే..

ప్రస్తుతం నిఖిల్..   కార్తికేయ 2 సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ 20 కోట్లకు సొంతం చేసుకున్నారు జీ సంస్థలు. కేవలం కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే విడుదలైనా.. వీటితోనే సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరగడం గమనార్హం. Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముగ్ధ అనే పాత్రలో నటిస్తున్నారు అనుపమ పరమేశ్వరన్. ఈమె పాత్ర చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు దర్శకుడు చందూ మొండేటి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

First published:

Tags: Hero nikhil, Tollywood

ఉత్తమ కథలు