పవన్ భామతో రొమాన్స్ చేయనున్న నిఖిల్..

నిఖిల్ (nikhil siddharth)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చాడు నిఖిల్. ఆ సినిమాలో నలుగురిలో ఒకడుగా ఉన్నా.. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూ అదరగొడుతున్నాడు.

 • Share this:
  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చాడు నిఖిల్. ఆ సినిమాలో నలుగురిలో ఒకడుగా ఉన్నా.. ఆ తర్వాత సోలో హీరోగా నటిస్తూ అదరగొడుతున్నాడు. కొత్తదనంతో ఉన్న కథల్నీ ఎంచుకుని విజయాలను అందుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన హీరోగా వచ్చిన స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలు విజయాన్ని పొందాయి. నిఖిల్ తాజా చిత్రం 'అర్జున్ సురువరం' కాస్త పరవాలేదు అనిపించింది. ఇక ఆయన ప్రస్తుతం 2014లో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయం సాధించిన 'కార్తికేయ' సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న 'కార్తికేయ2' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.ఈ  సినిమాలో దాదాపు 5 వేల ఏళ్ల నాటి రహస్యాలను, అప్పటి సంప్రదాయాలు, చరిత్రను చర్చించనున్నారు.  కాగా ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్ లోనే మరో క్రేజ్ సినిమాతో రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతుంది.

  nikhil latest film updates, nikhil marriage update, karthikeya 2,nikhil wedding,kartikeya,actor kartikeya,karthikeya telugu movie,nikhil siddharth,hero nikhil,karthikeya movie,karthikeya movies,kartikeya speech,kartikeya teaser,kartikeya actor new movie,karthikeya trailer,actor nikhil,karthikeya nikhil movie,karthikeya 2 teaser,karthikeya 2,karthikeya new movie,actor kartikeya at radio city fm,hero nikhil siddharth marriage fixed,nikhil kumaraswamy engagement,nikhil wedding,nikhil marriage date,actor nikhil marriage,nikhil about his marriage,nikhil marriage latest news,hero nikhil marriage photos,నిఖిల్ పెళ్లి, నిఖిల్ న్యూస్, నిఖిల్ సినిమాలు, నిఖిల్ భార్య,
  నిఖిల్, అను ఇమ్మాన్యుల్ Photo : Twitter


  కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చించినట్లు తెలుస్తోంది. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
  Published by:Suresh Rachamalla
  First published: