హోమ్ /వార్తలు /సినిమా /

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ వాయిదా... సారీ చెప్పిన నిఖిల్..!

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ వాయిదా... సారీ చెప్పిన నిఖిల్..!

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

అనుకోకుండా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని మంగళవారం తెల్లవారు ఝామున హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

  యంగ్ హీరో నిఖిల్(Nikhil), ప్రామిసింగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో 'కార్తికేయ'కి సీక్వెల్ గా వస్తున్న 'కార్తికేయ -2′ (Karthikeya 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం వాయిదా పడినట్టుగా గత కొన్ని రోజులు నుంచి పలు రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇపుడు వార్తలను నిజం చేశాడు నిఖిల్. కార్తికేయ 2 సినిమా రిలీజ్ తేదీ వాయిదా పడుతున్నట్లు నిఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తమ సినిమా ఈ జూలై 22న రిలీజ్ కావట్లేదని బహుశా ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.

  దీంతో ఈ చిత్రం మాత్రం అధికారికంగా పోస్ట్ పోన్ అయిపోయినట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు చక్కని స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  ఈ సినిమాను జూలై 22న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం ప్రమోషనల్ టూర్ కూడా చేసింది. అయితే అనుకోకుండా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని మంగళవారం తెల్లవారు ఝామున హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమ చిత్రం ఆగస్ట్ మొదటి వారంలో జనం ముందుకు వచ్చే అవకాశం ఉందని నిఖిల్ పేర్కొన్నాడు. 'కార్తికేయ -2' మూవీలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు.

  మరో ఆసక్తికరమైన విషయం డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్ణుడు చరిత్రలోకి నిఖిల్ ఎంటర్ కావడం ఇందులోని విశేషం. కాలభైరవ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. మరి ఆగస్ట్ మొదటి వారంలో 'కార్తికేయ -2' విడుదలకు సిద్ధపడితే.. ఇప్పటికే 5వ తేదీకి కళ్యాణ్‌ రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం', సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు కూడా ఆగష్టులో కూడా విడుదల కానున్నాయి.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Hero nikhil, Karthikeya 2 Movie, Nikhil Siddharth

  ఉత్తమ కథలు