యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం కార్తికేయ 2 అనే సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా తాజాగా ట్రైలర్ (Karthikeya 2 Trailer) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మాస్ మాహారాజా రవితేజ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్లో ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి. ఆసక్తిరేకెత్తించే సీన్స్‌తో ట్రైలర్‌ను కట్ చేశారు. విజువల్స్ కూడా బాగున్నాయి. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుందో.. ఇక ఈ సినిమాలో నిఖిల్‌తో పాటు అనుపమ (Anupama Parameshwaran), అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అంతేకాదు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీ చూసి అద్భుతంగా ఉందన్నారు. కృష్ణుడి ద్వారకకు లింక్ చేసిన విధానం ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు సెన్సార్ వాళ్లు.
ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా.. సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా.. అలరించేలా తన పెన్‌కి పని పెట్టే దర్శకుడు చందు మెుండేటి (Chandoo Mondeti) మరొక్కసారి మనకి తెలియని కొత్త కథతో వస్తున్న చిత్రం కార్తికేయ 2. కమర్షియల్ విలువలు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆగష్టు 5కు పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
This one is so gripping!
Looks like another top class film????????https://t.co/2M70EKEHVi
My Best Wishes to the entire team of #Karthikeya2 :) Looking forward. #KrishnaIsTruth@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @peoplemediafcy
— Ravi Teja (@RaviTeja_offl) August 6, 2022
కార్తికేయ 2 షూటింగ్ మొదలయ్యిన దగ్గర నుంచి సామాన్య ప్రేక్షకుల్లో, సినిమా ప్రముఖుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంటగా నటిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటించారు. అనుపమ్ ఖేర్.. అపుడెపుడో ‘త్రిమూర్తులు’ మూవీలో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి కార్తికేయ 2తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈయన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెక్కారు.
కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తికేయ 2 స్టోరీ శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్టుడి చరిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పటికి ఆ లింక్ లో కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణం.శ్రీ కృష్ణుడు ఆయనకి సంబందించిన కథలో డాక్టర్ కార్తికేయ అన్వేషణగా శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎలా ఎంటరయ్యారనేది ఈ సినిమా స్టోరీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupama parameshwaran, Karthikeya 2 Movie, Nikhil siddarth