Home /News /movies /

NIKHIL MOVIE KARTHIKEYA 2 MOVIE THEATRICAL BUSINESS DETAILS SB

Karthikeya 2:భారీగా కార్తికేయ 2 థియేట్రికల్ బిజినెస్.. ఎన్నికోట్లంటే..!

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

కార్తికేయ 2 మోషన్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

రహస్యమైన ద్వారకానగరం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కార్తీకేయ 2లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

    కార్తికేయ 2 నిఖిల్ హీరోగా వస్తున్న సీక్వెల్ సినిమా.  2014లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అప్పట్లో 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి సర్ ప్రైజ్ చేసింది.  నిఖిల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వల్ గా కార్తికేయ 2 సినిమా వస్తుంది. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

    సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈమధ్య వచ్చిన కార్తికేయ 2 టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా టీజర్ చూసి బిజినెస్ బజ్ పెరిగిందని తెలుస్తుంది. కార్తికేయ 2 సినిమా థియేట్రికల్ బిజినెస్ 14 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. నిఖిల్ కెరియర్ లో ఈ సినిమా బిజినెస్ బాగా చేసినట్టు తెలుస్తుంది. నిఖిల్ అండ్ టీం మాత్రం సినిమా రిజల్ట్ పై గట్టి నమ్మకంగా ఉన్నారు.



    కార్తికేయ చిత్రంలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా న‌టిస్తే.. సీక్వెల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చేసింది. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ మూవీపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఈ నేప‌థ్యంలోనే `కార్తికేయ 2`కి క‌ళ్లు చెదిరే రీతిలో థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుగుతోంద‌ట‌. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీకి థియేట్రికల్‌ రైట్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ. 14 కోట్ల‌ నుంచి రూ. 20 కోట్లకు అమ్ముతున్నార‌ని తెలుస్తోంది.

    రహస్యమైన ద్వారకానగరం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య త‌దిత‌రులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఈ సినిమాను  పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hero nikhil, Karthikeya 2 Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు