Home /News /movies /

NIKHIL KARTHIKEYA 2 TRAILER 1 RELEASED OFFICIALLY SLB

Nikhil కార్తికేయ 2 ట్రైలర్.. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది! థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌

Photo Twitter

Photo Twitter

Karthikeya 2 Trailer: కార్తికేయ 2 మూవీ ప్రకటించినప్పటి నుండి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ చిత్ర ట్రైలర్ 1ని హైదరాబాద్ ఏఏంబీ సినిమాస్‌లో ప్రదర్శించడమే కాకుండా అఫీషియల్‌గా విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth) ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమా కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో వచ్చి సూపర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చందు మొండేటి (Chandu Mondeti) ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రకటించినప్పటి నుండి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఈ చిత్ర ట్రైలర్ 1ని హైదరాబాద్ ఏఏంబీ సినిమాస్‌లో ప్రదర్శించడమే కాకుండా అఫీషియల్‌గా విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన రాగా.. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ కి కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా అత్యద్భుతమైన విజువల్ ఫీస్టుగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని ట్రైలర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2. చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Hero nikhil, Karthikeya 2 Movie, Tollywood

తదుపరి వార్తలు