Home /News /movies /

NIKHIL KARTHIKEYA 2 MOVIE PRE RELEASE BUSINESS DETAILS HERE SLB

Karthikeya 2: నిఖిల్ జోరు మామూలుగా లేదు.. విడుదలకు ముందే సాలీడ్ బిజినెస్!

Photo Twitter

Photo Twitter

Nikhil karthikeya 2: మొదటిసారి నిఖిల్ అతిపెద్ద టార్గెట్ ను ఫినిష్ చేయాలని సిద్ధమవుతున్నాడు. కార్తికేయ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil) కార్తికేయ 2 (Karthikeya- 2) సినిమాతో ఈసారి ఎలాగైనా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా హీరో నిఖిల్ కెరీర్ లో కూడా ఆ సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకొని అప్పట్లో మంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా తీసుకొస్తున్న కార్తికేయ 2 కూడా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని ఈ హీరో ఎంతో నమ్మకంతో ఉన్నాడు.

చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో తనకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇదివరకే విడుదలైన ట్రైలర్ కి కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది. ఇక ఈనెల 22వ తేదీన రాబోతున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. ఇక ఈ సినిమాతో మొదటిసారి నిఖిల్ అతిపెద్ద టార్గెట్ ను ఫినిష్ చేయాలని సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

చాలా ఏరియాల్లో నిర్మాతలు ఈ సినిమాను అమ్మేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే పెట్టిన పెట్టుబడికి ప్రస్తుతం థియేట్రికల్ గా వారు ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఒకవేళ లాభాలు వస్తే మాత్రం అందులో వాటా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక నాన్ థియేట్రికల్ గా కూడా నిర్మాతలు భారీ స్థాయిలోనే ప్రాఫిట్స్ అందుకున్నారు. ఈ సినిమా ఓటిటి శాటిలైట్ హక్కుల రూపంలో దాదాపు అన్ని భాషల్లో కలిపి 16 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమాకు తో నిర్మాతలు విడుదలకు ముందే భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకున్నట్లు సమాచారం

ఇక ఇప్పుడు బయర్లకు టెస్టింగ్ టైం అనే చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా ఎంతో బాగుంటే కానీ జనాలు థియేటర్లో సినిమాను చూడడానికి రావడం లేదు. ఇక కార్తికేయ 2 సినిమా అడ్వెంచర్ మిస్టరీ సినిమా కాబట్టి తప్పకుండా థియేటర్లో చూడాలని ప్రేక్షకులు భారీ సంఖ్యలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఏమాత్రం ఆగవు అని చెప్పవచ్చు. ఇక పోటీగా పెద్దగా ఏ సినిమాలు లేవు. మరి కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Published by:Sunil Boddula
First published:

Tags: Hero nikhil, Karthikeya 2 Movie, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు