‘అర్జున్ సురవరం’ ట్రైలర్ టాక్.. రిపోర్టర్‌గా అదరగొట్టిన నిఖిల్..

రెండేళ్ల కింది వ‌ర‌కు వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్నాడు నిఖిల్."స్వామిరారా"తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన త‌ర్వాత వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు. తాజాగా నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే సినిమా చేసాడు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

news18-telugu
Updated: November 19, 2019, 6:00 PM IST
‘అర్జున్ సురవరం’ ట్రైలర్ టాక్.. రిపోర్టర్‌గా అదరగొట్టిన నిఖిల్..
‘అర్జున్ సురవరం’ ట్రైలర్ టాక్ (Twitter/Photo)
  • Share this:
రెండేళ్ల కింది వ‌ర‌కు వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్నాడు నిఖిల్."స్వామిరారా"తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన త‌ర్వాత వ‌ర‌స విజ‌యాలు అందుకున్నాడు. "కార్తికేయ‌", "ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా" లాంటి సినిమాలు ఈయ‌న అంచ‌నాలు నిల‌బెట్టాయి. "సూర్య వ‌ర్సెస్ సూర్య‌", "కేశ‌వ" లాంటి సినిమాలు యావ‌రేజ్ అనిపించాయి. ఇలాంటి స‌మ‌యంలో వ‌చ్చిన "కిరాక్ పార్టీ" దారుణంగా ప్లాప్ అయింది. ఈ చిత్రంతో యూత్‌ను టార్గెట్ చేయాల‌నుకుని అడ్డంగా బుక్ అయిపోయాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్..హీరోగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్..టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో ‘అర్జున్ సురవరం’ అనే సినిమా చేసాడు.తాజాగా ఈ సినిమాను ట్రైలర్ విడుదల చేసారు.ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటించాడు. దొంగ సర్టిఫికేట్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ట్రైలర్‌లో చూపించిన సీన్స్ బాగున్నాయి. ముందుగా ఈ సినిమాకు ‘ముద్ర’అనే టైటిల్ అనుకున్న .. ఆల్రెడీ ఆ టైటిల్‌తో ఒక సినిమా రావడంతో ఈ సినిమాను పేరును మార్చాడు. ఒకప్పటి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డిని స్పురించేలా ఈ సినిమాకు అర్జున్ సురవరం అనే టైటిల్ ఖరారు చేసినట్టు కనబడుతోంది.ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నిఖిల్ తాను కోరుకున్న హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...