Home /News /movies /

NIKHIL ANUPAMA PARAMESHWARAN KARTHIKEYA2 TWITTER REVIEW SR

Karthikeya 2 Twitter Review : కార్తికేయ2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే.

Karthikeya 2 Twitter Review  Photo : Twitter

Karthikeya 2 Twitter Review Photo : Twitter

Karthikeya 2 Twitter Review : యువ హీరో నిఖిల్ (Nikhil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి సినిమాలతో యూత్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చారు. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఈసినిమా ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Karthikeya 2 : విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ హీరో నిఖిల్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ కార్తికేయ2. చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దాదాపుగా ఎనిమిదేళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూస్ పడ్డాయి.. మరి సినిమా ఎలా ఉంది.. కథేంటీ.. కథనం ఆకట్టుకుంటోందా.. మొదలగు విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.. అవేంటో చూద్దాం.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తుంటే.. ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. ఓవరాల్‌గా సినిమా బాగుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎప్పటిలానే నిఖిల్ మరోసారి తన నటనతో అదరగొట్టారని.. మరో హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. హీరోయిన్ అనుపమ కూడా తన పాత్రలో కేకపెట్టించారని అంటున్నారు. సినిమాలో కాలభైరవ మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ అని చెబుతున్నారు నెటిజన్స్.

    ఇక ఇప్పటికే టీజర్స్, ట్రైలర్‌తో మంచి బజ్‌ను తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్‌ను చేసుకుంది. కార్తికేయ 1 మంచి హిట్ అవ్వడంతో అదే సినిమాకు సీక్వెల్‌గా వస్తో్న్న కార్తికేయ 2కు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ అయ్యింది.  ఈ సినిమా నైజాంలో 3.50 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో పాటు సీడెడ్: 1.8 కోట్లు, ఆంధ్రా: 6 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తంగా 11.30 కోట్లకు అమ్ముడు పోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక కర్నాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్ : 1.00 కోట్లుగా అమ్ముడు పోయిందని తెలుస్తోంది. దీంతో మొత్తంగా ఈ సినిమా12.80 కోట్లకు అమ్ముడు అవ్వగా.. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 13.30 కోట్ల షేర్ రావాల్సి ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.












    ఇక ఈ సినిమాలో నిఖిల్‌తో పాటు అనుపమ (Anupama Parameshwaran), అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలకపాత్రల్లో కనిపించనున్నారు. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు, విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా కార్తికేయ 2 సినిమాను నిర్మించాయి. కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్య పురం నేపథ్యంలో తెరకెక్కిస్తే.. కార్తికేయ 2 స్టోరీ శ్రీ కృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Karthikeya 2 Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు