హోమ్ /వార్తలు /సినిమా /

Nikhil: 18 పేజిస్ క్లాసీ మెలోడీ లిరికల్ వీడియో రిలీజ్

Nikhil: 18 పేజిస్ క్లాసీ మెలోడీ లిరికల్ వీడియో రిలీజ్

18 pages Photo Twitter

18 pages Photo Twitter

Nikhil 18 pages song: జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్". నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై రాబోతున్న తదుపరి చిత్రం "18 పేజిస్". నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama) హీరోహీరోయిన్లుగా ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ "18 పేజిస్" సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

తాజాగా "18 పేజిస్" చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటను లిరిసిస్ట్ శ్రీమణి రచించారు. ఏ కన్నుకి ఏ స్వప్నమో ఏ రెప్పెలైన తెలిపేనా ఏ నడకది ఏ పయనమో ఏ పాదమైన చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగేనా.. నన్నయ్య రాసిన కావ్యమగితే, తిక్కన తీర్చేనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమా కృష్ణుడు పాడెనుగా అని శ్రీమణి రచించిన లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తున్నాయి.' isDesktop="true" id="1513414" youtubeid="kKbjCMRawQ4" category="movies">

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. "నన్నయ్య రాసిన" పాటను పృథ్వి చంద్ర, సితార కృష్ణ కుమార్ ఆలపించారు. ఈ పాట వినసొంపుగా ఉంది. ఖచ్చితంగా ఈ పాట మంచి మెలోడీ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

First published:

Tags: Anupama parameshwaran, Nikhil Siddharth, Tollywood

ఉత్తమ కథలు