#MeToo: నవాజుద్దీన్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేసిన నిహారిక

ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా లొంగదీసుకున్నాడు... నా ఫోన్ తీసుకునే చాలామంది అమ్మాయిలకు ఫోన్ చేసేవాడు... నిజస్వరూపం తెలిశాక అతన్ని దూరం పెట్టా... మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్ ఆరోపణలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 10, 2018, 2:47 PM IST
#MeToo: నవాజుద్దీన్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేసిన నిహారిక
నిహారిక సింగ్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Twitter)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 10, 2018, 2:47 PM IST
మాజీ హీరోయిన్ తనుశ్రీదత్తా రీస్టార్ట్ చేసిన ‘మీటూ’ ఉద్యమం దేశాన్ని అతలాకుతం చేస్తోంది. సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ, క్రీడా, మీడియా రంగాల్లోని మహిళలు, తమకు గతంలో ఎదురైనా చేదు అనుభవాలను బయటపెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ‘మీటూ’ బారిన పడి అప్రతిష్ట మూటకట్టుకున్నారు. తాజాగా వినూత్న చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపైన కూడా ‘మీటూ’ ఆరోపణలు చేసింది మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నిహారిక సింగ్.

‘మిస్ లవ్‌లీ’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నన్ను ఇంటికి లంచ్‌కి రమ్మని పిలిచాడు. వెళ్లాను. అప్పటి నుంచి ఇద్దరం తరుచూ కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఓ రోజు మీ ఇంటి ముందే ఉన్నా... అని మెసేజ్ చేస్తే, వెళ్లి ఇంట్లోకి రమ్మని ఆహ్వానించా. ఇంట్లోకి రాగానే నన్ను కౌగిలించుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ రోజు నన్ను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
నిహారిక సింగ్, మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్


ఓసారి తనకూ మిస్ ఇండియాను పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని చెబితే నమ్మానని చెప్పిన నిహారిక... తన చెల్లెలు ముందునుంచి నవాజుద్దీన్‌లో నిజాయితీ కనిపించడం లేదని హెచ్చరించిందని పేర్కొంది. అయితే కొన్నాళ్లకు అతని నిజస్వరూపం తెలిసిందని, చాలామంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని తెలిసి షాక్ అయ్యానని చెప్పింది. ‘నా ఫోన్ తీసుకునే అమ్మాయిలకు ఫోన్ చేసేవాడు... ’ అంటూ వాపోయింది నిహారిక. నవాజుద్దీన్‌కు అప్పటికే పెళ్లి అయ్యిందని, వరకట్న వేధింపుల కేసు నడుస్తోందని తెలిసిన తర్వాతే అతనికి దూరమయ్యానని, అప్పటికీ తనతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు సిద్దిఖీ ప్రయత్నించాడని సోషల్ మీడియాద్వారా ఆరోపణలు చేసింది నిహారిక.
First published: November 10, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...