హోమ్ /వార్తలు /సినిమా /

Niharika - Hello World : మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో వస్తున్న హలో వరల్డ్..

Niharika - Hello World : మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో వస్తున్న హలో వరల్డ్..

హలో వాల్డ్ (Twitter/Photo)

హలో వాల్డ్ (Twitter/Photo)

Niharika - Hello World : మెగా డాటర్  నిహారిక సమర్ఫణలో ’హలో వరల్డ్' అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ZEE 5' తో కలిసి నిహారిక ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్‌ని రూపొందించింది. పెళ్లి తర్వాత నిహారిక నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ఇదే.

ఇంకా చదవండి ...

Niharika - Hello World :  నటిగా ఇండస్ట్రీకి వచ్చిన నిహారిక.. తండ్రి నాగబాబు బాటలోనే నిర్మాతగా మారింది. 'ఒక మనసు' చిత్రంతో పరిచయమైన నిహారిక.. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది నిహారిక. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లని నిర్మించడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆమె నిర్మించిన 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్నకూచి', 'మేడ్ హౌస్', 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వంటి సిరీస్‌లు ఈ సంస్థ నుంచి వచ్చి మంచి స్పందన అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ''హలో వరల్డ్'' అనే మరో సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ZEE 5' తో కలిసి నిహారిక ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్‌ని రూపొందించింది. పెళ్లి తర్వాత నిహారిక నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ఇదే.

'గీతా సుబ్రహ్మణ్యం' ఫేమ్ శివసాయి వర్ధన్ జలదంకి దీనికి దర్శకత్వం వహించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇందులో ఒకప్పటి హీరో, అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించాడు. జయం ఫేమ్ సదా, నిఖిల్ వి సింహా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి, జీలా అనిల్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కామెడీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ జీ5 అనౌన్స్ చేసింది. ''హలో వరల్డ్'' సిరీస్‌ను ఇండిపెండెన్స్ డే వీక్ లో ఆగస్టు 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్  చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఆఫీస్ డ్రామాని 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తమ కష్టాల నుంచి బయటపడాలనే ఆశతో పెద్ద ఐటీ కంపెనీలోకి అడుగుపెట్టిన ఎనిమిది మంది యువకుల కథ ఇది.  జీవితం అంటే తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుందని తెలియజెప్తుందని మేకర్స్ వెల్లడించారు. 'హలో వరల్డ్' తో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను చక్కగా  ఆవిష్కరించనున్నారు.

‘హలో వరల్డ్’ (Twitter/Photo)

వర్క్ ప్లేస్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు జీ5 ఓటీటీతో కలిసి నిహారిక తీసుకురాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి ప్రేక్షకాదరణను పొందుతుందో చూడాలి. నిజానికి Zee5 ఓటీటీ గత కొంతకాలంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్రెష్ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేస్తోంది. RRR వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు పెడుతోంది. తెలుగు కంటెంట్ విషయంలో దూసుకుపోతోన్న జీ5.. ''హలో వరల్డ్' తో మరింత మందికి దగ్గరవ్వాలని భావిస్తోంది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Niharika konidela, Zee5

ఉత్తమ కథలు