Niharika Marriage Pawan Kalyan: మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరికొన్ని గంటల్లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నిహారిక మ్యారేజ్ గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఈ బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరుగుతుంది. దీంతో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరందుకున్నాయి. ఈ వేడుకలో ఇప్పటికే మెగా (కొణిదెల) ఫ్యామిలీకి పెద్ద మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసనతో దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డితో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు. ఒక్కొక్కరుగా పెళ్లి వేడుకలకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదిస్తున్నారు. కానీ ఒక్కటే లోటు మాత్రం కనబడుతోంది. నిహారిక పెళ్లిలో బాబాయి పవన్ కళ్యాణ్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
పవన్ కళ్యాన్ పాలిటిక్స్‌తో బిజీగా ఉండటమే. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈయన షెడ్యూల్ మరో మూడేళ్ల వరకు కూడా టైట్ అయిపోయింది. అప్పటి వరకు కనీసం పక్కకు తిరిగి చూడలేని బిజీ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే ఇప్పుడు రైతులకు న్యాయం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు పవన్. జనం కోసం కదిలి జనసేనాని ముందుకొచ్చాడు.

బేగంపేటలో ప్రత్యేక విమానంలో ఉదయపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
ఆంధ్రప్రదేశ్‌లో నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.తాజాగా ఎట్టకేలకు అన్నయ్య కూతురు పెళ్లి కోసం ఇపుడు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్‌కు చేరుకున్నారు. మొత్తంగా అన్నయ్య కూతురుకు ప్రామిస్ చేసినట్టు సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్.. చేరుకోవడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 08, 2020, 18:40 IST