Niharika-Pawan Kalyan: బాబాయి పవన్ కళ్యాన్ ప్రామిస్.. నిహారిక హ్యాపీ..

నిహారిక నిశ్చితార్థం (Niharika Engagement)

Pawan kalyan promise...niharika happy | ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా అందరూ పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. హీరోలు, హీరోయిన్లు,  దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. నిహారిక నిశ్చితార్ధానికి హాజరు కాలేకపోయినా పవన్ కళ్యాన్.. పెళ్లికి మాత్రం..

  • Share this:
    Pawan kalyan promise...niharika happy | ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా అందరూ పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. హీరోలు, హీరోయిన్లు,  దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇపుడు నిహారిక, చైతన్యల పెళ్లికి మూహూర్తం ఖరారైంది. ఇప్పటికే నిహారిక, చైతన్యల నిశ్చితార్ధ వేడుక ఆగష్టు 13న ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలో మొత్తం సభ్యులు హాజరైనా.. పవన్ కళ్యాణ్ రాని లోటు మాత్రం కనబడింది. అంతేకాదు అంతకు ముందు నితిన్ పెళ్లి హాజరైన పవన్ కళ్యాణ్.. సొంత అన్నయ్య కూతురు నిశ్చితార్ధానికి (పూలు పండ్లు) కు హాజరు కాకపోవడంపై విమర్శలు చెలరేగాయి. తాజాగా నిహారిక పెళ్లికి రెండు రోజులు ముందే హాజరవుతానని నిహాకు మాట ఇచ్చాడట. నిహారిక, చైతన్యల  పెళ్లి డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు మాత్రం రెండు రోజులు ముందుగానే వెళ్లనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే నిహారికతో పాటు కుటుంబ సభ్యుల పెళ్లి పనులు నిమిత్తం ఉదయ్‌పూర్ బయలుదేరి వెళ్లారు. అక్కడే పెళ్లికి సంబంధించిన అన్ని పనులు నిర్వహించనున్నట్టు సమాచారం. 

    నిహారిక, చైతన్యల పెళ్లికి డిసెంబర్ 9న (twitter/Photo)


    చైతన్య జొన్నలగడ్డతో మెగా డాటర్ నిహారిక కొణిెదల వివాహాం.. డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఖరారైంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనుంది. నిహారికి మ్యారేజ్‌కు మెగాఫ్యామలీ ఎవరెవరని పిలుస్తారనేది చూడాలి. ఈ పెళ్లి కోసం నాగబాబు.. కాబోయే అల్లుడికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. డైరెక్ట్‌గా పెళ్లి కొడుకుకు కాకుండా.. నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరోవైపు పెళ్లికి నగలు నట్రా అవన్ని కలిపి మరో రూ. 2 కోట్ల వరకు ఉంటాయనేది సమాచారం. దాంతో పాటు నిహారిక పేరు మీద ఓ బంగ్లాను కూడా అల్లుడికి ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తంగా కట్నం ఊసెత్తకుండా.. నిహారికకు నాగబాబు ఇవన్ని లాంఛనంగా ఇవ్వబోతున్నట్టు మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: