Niharika Marriage: నిహారిక పెళ్లి కోసం నాగబాబు లాంఛనంగా పెళ్లికొడుకుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా..

నిహారిక మ్యారేజ్ (Instagram/Photo)

Niharika Marriage: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి వచ్చే నెల 9వ తేదిని రాత్రి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఈ పెళ్లిలో భాగంగా పెళ్లి కొడుకుకు లాంఛనంగా నాగబాబు బాగానే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    Niharika Marriage: మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి వచ్చే నెల 9వ తేదిని రాత్రి రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా తగ్గలేదు కాబట్టి.. ఈ పెళ్లిని కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా చేయబోతున్నారు. అంతేకాదు పెళ్లికి కొంత మంది అతిథిలను మాత్రమే పిలువనున్నాట్టు సమాచారం. మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో సన్నిహితులు చాలా మందే ఉన్నారు. కాబట్టి.. నిహారికి మ్యారేజ్‌కు మెగాఫ్యామలీ ఎవరెవరని పిలుస్తారనేది చూడాలి. ఈ పెళ్లి కోసం నాగబాబు.. కాబోయే అల్లుడికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. డైరెక్ట్‌గా పెళ్లి కొడుకుకు కాకుండా.. నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరోవైపు పెళ్లికి నగలు నట్రా అవన్ని కలిపి మరో రూ. 2 కోట్ల వరకు ఉంటాయనేది సమాచారం. దాంతో పాటు నిహారిక పేరు మీద ఓ బంగ్లాను కూడా అల్లుడికి ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తంగా కట్నం ఊసెత్తకుండా.. నిహారికకు నాగబాబు ఇవన్ని లాంఛనంగా ఇవ్వబోతున్నట్టు మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి.

    కూతురు నిహారికతో నాగబాబు (Instagram/Photo)


    ఇక నిహారిక, చైతన్య జొన్నలగగ్డ నిశ్చితార్ధ వేడుక ఆగష్టు 13న ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత నిహారిక.. కాబోయే వాడితో ఫోటోలు దిగుతూ.. సందడి చేస్తోంది. రీసెంట్‌గా చైతన్యతో కలిసి నిహారిక తన ఇంట్లో దీపావళి వేడుకలు చేసుకుంది. మరోవైపు నిహారిక ...తన ఫ్రెండ్స్‌కు గోవాలో బ్యాచిరల్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ పార్టీలో నిహారిక స్నేహితురాళ్లతో కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లికి సంబంధించిన పనులన్ని వేగంగా జరుగుతున్నాయి. నిహారికకు కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డ విషయానకొస్తే.. ఈయన  తండ్రి ప్రభాకర రావు గుంటూరు రేంజ్ ఐజీ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక  చైతన్య  హైదారాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఈయన చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో లెక్కల్లో మాస్టర్ డిగ్రీ చేసాడు. అంతేకాదు హైదరాబాద్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: