మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరికొన్ని గంటల్లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే. నిహారిక పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరానందన్‌తో కలిసి నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరుకున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన అన్నయ్య కూతురు పెళ్లి పనులను దగ్గరుండి చూస్తున్నారు. నిహారిక పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకతో మరింత గ్లామర్ పెరిగినట్టైంది. ఇక ఆరడుగుల బుల్లెట్‌ను మించి ఉన్న అకిరానందన్ చూస్తుంటే.. అచ్చు పవన్ కళ్యాణ్‌ను చూసినట్టే ఫీలవుతున్నారు మెగాభిమానులు. పవన్ కళ్యాణ్ కంటే ముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరు హీరోలు.. కుటుంబ సభ్యులు హాజరై పెళ్లిలో సందడి చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక మరికొన్ని గంటల్లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబుతున్న సంగతి తెలిసిందే.
నిహారిక మ్యారేజ్ గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఈ రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో జరుగనుంది. దీంతో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరందుకున్నాయి. ఈ వేడుకలో ఇప్పటికే మెగా (కొణిదెల) ఫ్యామిలీకి పెద్ద మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసనతో దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డితో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు.

నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోల సందడి (Twitter/Photo)
ఒక్కొక్కరుగా పెళ్లి వేడుకలకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదిస్తున్నారు. మొత్తం 120 మందికి పైగా గెస్ట్‌లు హాజరు కానున్నారు. మొత్తంగా నిహారికి పెళ్లికి మెగా ఫ్యామిలీ నుండి కాకుండా ఇండస్ట్రీ నుండి చాలా మందికే ఆహ్వానాలు అందినట్టు సమాచారం. వీరిలో ఎవరు నిహారిక పెళ్లికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదిస్తారనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 09, 2020, 17:14 IST