• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIHARIKA KONIDELA VIJAY SETHUPATHI O MANCHI ROJU CHUSI CHEPTA FIRST LOOK RELEASED SR

Niharika Konidela : విజయ్ సేతుపతి సినిమాలో నిహారిక కొణిదెల.. ఫస్ట్ లుక్ విడుదల..

Niharika Konidela : విజయ్ సేతుపతి సినిమాలో నిహారిక కొణిదెల.. ఫస్ట్ లుక్ విడుదల..

Niharika Konidela Vijay Sethupathi O Manchi Roju Chusi Chepta first lookPhoto : Twitter

Niharika Konidela : మెగా డాటర్‌ నిహారిక 2018లో ఓ తమిళ సినిమాలో నటించింది. ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో యువరాణి పాత్రలో నటించింది.

  • Share this:
    మెగా డాటర్‌ నిహారిక 2018లో ఓ తమిళ సినిమాలో నటించింది. ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే సినిమాలో యువరాణి పాత్రలో నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడ నటించాడు. ప్రస్తుతం తెలుగులో విజయ్ సేతుపతికి మంచి పాపులారిటీ దక్కడంతో ఆయన నటించిన పాత తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. అందులో భాగంగా సూపర్ డీలక్స్ అనే సినిమాను విడుదల చేస్తుండగా.. తాజాగా ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ అనే తమిళ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో ఇక్కడ కూడా సూపర్ పాపులర్ అయ్యాడు. దీంతో పాపులారిటీని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు నిర్మాతలు. ఈ సినిమాను ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్‌ను ఖారారు చేసి మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అపోలో సంస్థ బ్యానర్‌లో ఈ సినిమా తెలుగులో విడుదలకానుంది. ఈ సినిమాకు అర్ముగ కుమార్ దర్శకుడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

    ఈ పోస్టర్‌లో విజయ్‌ కొత్తలుక్‌ ఆసక్తికరంగా ఉంది. వైష్ణవ్ తేజ్  ‘ఉప్పెన’ చిత్రంలో హీరోయిన్‌ తండ్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో యమధర్మ రాజుగా కనిపించనున్నాడు.  చూడాలి సినిమా ఎలా ఉండనుందో.. ఇక నిహారిక విషయానికి వస్తే.. గతేడాది నిహారిక చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోంది.

    ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. 'ఒక మనసు' 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్‌లు మాత్రం భాగానే అలరించాయి.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు