Niharika: న్యూ ఇయర్ రోజు మెగా ఫాన్స్ కు అసలు సిసలు పండగే.. రేర్ ఫోటో షేర్ చేసిన నిహారిక..

నిహారిక కొత్త యేడాది వేడుకలు (Facebook/Photo)

Niharika New Year Celebrations 2021 | న్యూ ఇయర్ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత న్యూ ఇయర్ వేడుకలను యూస్‌లో ఎంతో సింపుల్‌గా జరుపుకుంది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

  • Share this:
    Niharika New Year Celebrations 2021 | న్యూ ఇయర్ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త యేడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత న్యూ ఇయర్ వేడుకలను యూస్‌లో ఎంతో సింపుల్‌గా జరుపుకుంది. ఎపుడు కుటుంబ సభ్యులు, స్నేహితులుతో ఎంతో ఆప్యాయంగా కొత్త యేడాది వేడుకలను చేసుకునే నిహారిక.. ఇపుడు తన భర్త చైతన్యతో కొత్త యేడాది వేడుకలను చేసుకుంది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ మిస్ అయిన సందర్భంగా వాళ్లతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిహారిక పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ తన భర్త‌ను కలిసి హానీమూన్‌ వెకేషన్స్‌ను సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

    హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట .. అటు నుంచి అటు యూస్‌కు వెళ్లారు. అక్కడే నిహారిక తన కొత్త యేడాదికి స్వాగతం పలికింది. ఒక రకంగా పెళ్లి తర్వాత నిహారికు ఇదే కొత్త న్యూ ఇయర్. తన భర్త చైతన్యతో కొత్త యేడాది సెలబ్రేట్ చేసుకున్నారు.

    నిహారిక, చైతన్యల పెళ్లి గత నెల డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరు హాజరయ్యారు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత నిహారిక తన భర్త కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది. అంతేకాదు టాలెంట్ ఉన్న దర్శకులతో వెబ్ సిరీస్‌లను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని కథలను ఓకే చేసిన ఈ జంట.. హనీమూన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత వెబ్ సిరీస్‌లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: