అక్క సుస్మిత పెళ్లిలో నిహారిక ఎలా ఉందో చూడండి.. (Instagram/Photo)
Niharika Konidela Jonnalagadda | సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తరువాత కూడా చురుగ్గా తన లేటెస్ట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు.
Niharika Konidela Jonnalagadda | సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తరువాత కూడా చురుగ్గా తన లేటెస్ట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) 1.9 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. కళ్లు చెదిరే చీరల్లో కనిపిస్తున్న నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికా సరికొత్తగా కనిపిస్తోంది. అంతేకాదు మెగా కుటుంబం (Mega family) నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించిన నిహారిక.. పలు వెబ్ సిరీస్ లతో సందడి చేసింది. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక వెస్ట్రన్ వేర్ తో పాటు చీరల్లో కనిపిస్తూ మెగా అభిమానులను అలరిస్తుంటారు.
నిహారిక పెళ్లి గతేడాది డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. ఈ పెళ్లిలో నిహారిక 32 ఏళ్ల నాటి తన తల్లి పెళ్లి నాటి చీరలో మెరిసిపోయింది. అంతేకాదు పెళ్లి తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌లతో బిజీ అయింది. అంతేకాదు తన భర్త చైతన్యతో కలిసి కొత్త వెబ్ సిరీస్‌తో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. నిహారిక.. తన అక్కయ్య మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో నిహారిక చిన్న పిల్లగా ఎంతో క్యూట్‌గా ఉంది. ఈ ఫోటోలో నాగబాబు దంపతులతో పాటు వరుణ్ తేజ్ కూడా ఈ ఫోటోను మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తంగా అక్కయ్య పెళ్లి ఫోటోలో చిన్నారి నిహారిక హైలెట్‌గా నిలిచిందనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.