HOME » NEWS » movies » NIHARIKA KONIDELA SAYS I LOVE YOU TO UPPENA HERO VAISHNAV TEJ AND POST GOES VIRAL PK

Niharika Konidela: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక.. వైరల్ అవుతున్న పోస్ట్..

Niharika Konidela: ఈ మధ్య సోషల్ మీడియాలో నిహారిక పేరు చాలా వినిపిస్తుంది. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె పెళ్లి అయిపోయింది కాబట్టి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లోనే ఉంటుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2021, 6:40 PM IST
Niharika Konidela: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక.. వైరల్ అవుతున్న పోస్ట్..
నిహారిక కొణిదెల (Niharika Konidela)
  • Share this:
ఈ మధ్య సోషల్ మీడియాలో నిహారిక పేరు చాలా వినిపిస్తుంది. దానికి కారణం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె పెళ్లి అయిపోయింది కాబట్టి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లోనే ఉంటుంది నిహారిక. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే వెబ్ సిరీస్ కూడా మొదలు పెట్టింది. అందులో అనసూయ భరద్వాజ్ కూడా నటించబోతుంది. అంతేకాదు అప్పుడప్పుడూ భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి ఫోటోలు కూడా షేర్ చేస్తుంది. ఈ మధ్యే మల్దీవ్స్‌కు హనీమూన్ కూడా వెళ్లొచ్చారు నిహా చైతన్య జోడీ. ఇదిలా ఉంటే ఇప్పుడు నిహారిక ఐ లవ్ యూ బంగారు అంటూ నిహారిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పెళ్లైంది కదా భర్తను బంగారు అనుకుంటుంది.. లేదంటే ఇంకేమైనా అనుకుంటుంది.. మీకెందుకు అనుకుంటున్నారా..? అవును నిజమే.. కానీ ఇక్కడ నిహారిక చెప్పింది భర్త చైతన్యకు కాదు.. బావకు ప్రేమతో సినిమా ఇక్కడ జరుగుతుంది. అర్థం కాలేదు కదా.. నిహారికు బావలు చాలా మందే ఉన్నారు. అత్త కొడుకులు అన్నమాట. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ను ఉద్దేశించి ఈ మెసేజ్ పెట్టింది నిహారిక. జనవరి 13న ఈ కుర్రాడి పుట్టిన రోజు.

దాంతో ఐ లవ్ యూ బంగారు.. నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో.. లవ్ యూ వైష్ గా అంటూ పోస్ట్ చేసింది నిహారిక. అందులో వైష్ణవ్‌ను కౌగిలించుకుని తన ప్రేమను చూపించింది. అయితే మెగా కుటుంబంలో బావలు, మరదళ్లు అనే తేడా ఉండదు. అక్కడంతా అన్నాచెల్లెళ్లే ఉంటారు. ఎందుకంటే గతంలోనూ సాయి ధరమ్ తేజ్ ఇదే మాట చెప్పాడు. సాయితో నిహారిక పెళ్లి జరగబోతుందనే వార్తలు వచ్చినపుడు అలాగే స్పందించాడు సాయి. వైష్ణవ్ కూడా తనకు నిహారిక సిస్టర్ లాంటిదే అంటాడు. మొత్తానికి ఆ బ్రదర్ హుడ్‌తోనే ఐ లవ్ యూ బంగారూ అంటూ ప్రేమగా మెసేజ్ చేసింది నిహారిక.
Published by: Praveen Kumar Vadla
First published: January 13, 2021, 6:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading