హోమ్ /వార్తలు /సినిమా /

ZEE5 : 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌తో అదరగొడుతోన్న హలో వరల్డ్ వెబ్ సిరీస్.. ఖుషి ఖషీగా నిహారిక..

ZEE5 : 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌తో అదరగొడుతోన్న హలో వరల్డ్ వెబ్ సిరీస్.. ఖుషి ఖషీగా నిహారిక..

Hello World web series Photo : Twitter

Hello World web series Photo : Twitter

Hello World Web Series : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఇదే బ్యానర్‌లో "హలో వరల్డ్’ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తాజాగా సదా, ఆర్యన్ రాజేష్‌లు కూడా OTT లో అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ( Hello World Telugu web series) గురించి ‘ప్రత్యేకంగా చెప్పాలంటే IT లో వర్క్ చేసే వారి జీవితాలు మరియు కెరీర్ సంబంధిత ఒత్తిడి, భయాలు మరియు ఆశలను ప్రతిబింబించేలా దర్శకుడు శివసాయి వర్ధన్ చక్కటి సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించడం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ సిరీస్‌ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో ఆగస్టు 12 నుండి ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతున్న "హలో వరల్డ్' వెబ్ సిరీస్  (Hello World Telugu web series) విడుదలైన కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ తో దూసుకుపోతూ వీక్షకులను, యువత హృదయాలను గెలుచుకుంది. ZEE5, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నిర్మాత నిహారిక కొణిదెలతో (Niharika Konidela ) కలసి నిర్మించిన "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఇదే బ్యానర్ లో "హలో వరల్డ్’ తో వరుసగా రెండవ హిట్ లభించడం విశేషం. ఈ సందర్బంగా "హలో వరల్డ్" నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, " ZEE5 తో కలసి చేసిన "హలో వరల్డ్" వెబ్ సిరీస్కు ఇంత ప్రోత్సాహకరమైన స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ముఖ్యంగా నేటి యువతను ఆకట్టుకుంది.


ఐటి లో వారు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి మేము నిజాయితీగా ప్రయత్నించాము.కార్పొరేట్ సెటప్‌లో పని-జీవితం మరియు కార్పొరేట్ జీవితం కోరే దాని యొక్క సారాంశాన్ని వివరించడానికి ప్రయత్నించాము. మా ప్రయత్నానికి వీక్షకుల నుండి విపరీతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పందనతో మేము డిజిటల్ రంగంలో మరెన్నో మైలురాళ్లను దాటే ప్రోత్సాహాన్ని కల్పించారు.
"నేను గతంలో చాలా సంవత్సరాల IT లో పని చేశాను. ఆ అనుభవం తో కొంత కల్పితం జోడించి ఈ స్క్రిప్ట్ రాకున్నాను. 'హలో వరల్డ్' ఒక ఐటి వారికే కాకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వెబ్ సిరీస్ ను చూసిన వారందరూ కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని దర్శకుడు ఇటీవల చెప్పిన అతని అంచనా నిజమైంది. Zee5 తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. నిర్మాత నిహారిక కొణిదెల సహకారంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.ఈ 'హలో వరల్డ్' సిరీస్ దేశవ్యాప్తంగా ఉన్న ఐటి వారికే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతూ అందరి ఆధారాభిమానాలు పొందుతుంది. నేటి కార్పొరేట్ ప్రపంచం లోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా తెరాకెక్కిన "హలో వరల్డ్' వెబ్ సిరీస్ వీక్షకులకు ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదన్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యా శెట్టి, నికిల్ వి సింహా, అపూర్వరావు తదితరులు నటించారు. శివసాయి వర్ధన్ జలదంకి దర్శకత్వం వహించగా.. నిహారిక కొణిదెల నిర్మించారు.

First published:

Tags: Niharika konidela, Tollywood news

ఉత్తమ కథలు