Niharika Konidela: వెబ్‌ సిరీస్‌ షురూ చేసిన నిహారిక కొణిదెల

Niharika Konidela New Web Series started

Niharika Konidela - Web Series: మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కొత్త వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఇవే...

  • Share this:
    మెగాడాటర్‌ నిహారిక కొణిదెల గత ఏడాది డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి, హనీమూన్‌తో సరదాగా గడిపిన నిహారిక భర్తతో పాటు రీసెంట్‌గానే హైదరాబాద్‌ చేరుకుంది. ఇప్పుడు మళ్లీ వర్క్‌లో ఫుల్‌ బిజీగా మారిపోయింది. అందులో భాగంగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి రెడీ అయిపోయింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌ను షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. లాంఛంగా ఈ వెబ్‌ సిరీస్‌ ప్రారంభమైంది. రాయుడు చిత్రాలు అనే బ్యానర్‌పై భాను రాయుడు ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో కొత్త చెప్పాల్సిన విషయమేమంటే.. ఇందులో హాట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. యూట్యూబర్‌గా మంచి పేరున్న నిఖిల్‌ విజయేంద్ర నటిస్తున్నాడు. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీత సారథ్యం వహిస్తున్నారు.

    నిహారికకు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం కొత్తేమీ కాదు. నిజానికి నిహారిక నటిగా ఓనమాలు దిద్దింది ఈ వెబ్‌ సిరీస్‌ల్లోనే. ముద్దపప్పు అవకాయ్‌, నాన్న కూచి, మ్యాడ్‌ హౌస్‌ వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తూ అందులో నటించింది. ఒక వైపు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూనే సినిమాల్లోనూ నటించింది నిహారిక. సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకున్న నిహారిక.. సక్సెస్‌ను మాత్రం దక్కించుకోలేదు. అదే తరుణంలో నిహారిక పెళ్లి అయ్యింది.



    పెళ్లి తర్వాత నిహారిక నటిస్తుందా? లేదా? అని డిస్కషన్స్‌ కూడా జరిగాయి. అయితే నిహారిక వెబ్‌ సిరీస్‌ల్లో నటించడానికి భర్త, అత్త మామల నుండి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొత్త వెబ్‌ సిరీస్‌లో నటించడానికి నిహారిక రెడీ అయినట్లు సమాచారం.
    Published by:Anil
    First published: