Niharika: నిహారికలో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆశ్యర్యపోతున్న మెగా ఫ్యాన్స్..

నిహారిక (Instagram/Photo)

Niharika Konidela : నిహారిక కొణిదెల..  మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగుపెట్టి తన కంటూ స్ఫెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. తాజాగా ఈమెలోని కొత్త యాంగిల్‌ను చూసి అభిమానులు ఆశ్యర్యపోతున్నారు.

  • Share this:
    నిహారిక కొణిదెల..  మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగుపెట్టి తన కంటూ స్ఫెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకుంది. ఒకవైపు ఈ మెగా డాటర్  సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు' పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. నిహారిక తాజాగా చిరంజీవి 'సైరా' సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. కాగా తాజాగా నిహారిక.. చేసిన డాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ వీడియోలో నిహారిక.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెలి’ సినిమాలోని మనోహర పాట మ్యూజిక్‌కు డాన్స్ అదరగొట్టింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: