Niharika: నిహారిక పెళ్లి పనులు ప్రారంభమయ్యాయిగా.. అపుడే పసుపు కార్యక్రమంలో మెగా డాటర్..

మరోవైపు వరుడు చైతన్య విషయానికి వస్తే చిన్ననాటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్న ఈయన.. ఇక్కడే చదువుకుని ఓ ప్రముఖ ఎమ్ఎన్‌సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజిస్ట్‌గా జాబ్ చేస్తున్నాడు. చిరంజీవికి ఈ కుటుంబంతో ముందు నుంచి సంబంధాలున్నాయి. 30 ఏళ్ల స్నేహాన్ని ఇప్పుడు బంధుత్వంగా మార్చుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో నాగబాబు అల్లుడు చైతన్య హీరోగా కూడా నటిస్తాడేమో మరి..?

Niharika Marriage | మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం ఈ మధ్యనే ఘనంగా జరగింది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా జరిగింది. తాజాగా పెళ్లి తంతులో మరో ముఖ్యమైన ఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది.

  • Share this:
    Niharika Marriage | మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం ఈ మధ్యనే ఘనంగా జరగింది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇరువురు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. వివాహా క్రతువుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిశ్చయ తాంబూలాలు వంటి కార్యక్రమ ఘట్టం పూర్తైయింది. తాజాగా ఈ రోజు పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. శ్రావణ మాసంలో చివరగా మిగిలిన మంచి ముహూర్తం ఈ రోజు ఉండటంతో మెగా కుటుంబ సభ్యులు శాస్త్రోత్తంగా నిహారిక ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు మెగాఫ్యామిలీకి చెందిని లేడీస్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.



    నిహారిక, చైతన్యల పెళ్లి వచ్చే కార్తీకం కానీ లేదా మార్గశిర మాసం అంటే అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయని  మెగాకుటుంబ సభ్యులు చెబుతున్నారు.వెంకట చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఈయన  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు.  ప్రస్తుతం.. ఈయన పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎంగేజ్మెంట్‌లో చైతన్య కోరమీసాలతో హీరో రేంజ్‌లో మెరిసాడు. ఈయన హడావుడి చూస్తుంటే.. ఇతను కూడా త్వరలో వెండితెరపై హీరోగా ప్రత్యక్షమైన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మెగాభిమానులు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: