Home /News /movies /

Niharika Konidela : నిహారిక కొణిదెల చిన్నప్పుడు ఇలా ఉండేదా... వైరల్ అవుతోన్న పిక్..

Niharika Konidela : నిహారిక కొణిదెల చిన్నప్పుడు ఇలా ఉండేదా... వైరల్ అవుతోన్న పిక్..

నిహారిక కొణిదెల (Niharika Konidela)

నిహారిక కొణిదెల (Niharika Konidela)

Niharika Konidela : వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు.. నిన్న నిహారిక కొణిదెల, వరుణ్‌ల చిన్నప్పటి పిక్స్‌ను తన అభిమానులతో షేర్ చేశాడు.

    మెగా హీరో వరుణ్ తేజ్ 31వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తన కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు. వరుణ్ బర్త్ డే సందర్భంగా వరుణ్ తండ్రి నాగబాబు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన వరుణ్‌కు చెందిన ఓ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ విష్ చేశాడు. ఇక నాగబాబు తన అభిమానులతో పంచుకున్న ఆ ఫోటోలో చిన్నారి వరుణ్, నిహారికతో పాటు వరుణ్ తల్లి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగబాబు షేర్ చేసిన ఆ ఫోటోలో నిహారిక సూపర్ క్యూట్‌ లుక్‌లో కేకపెట్టిస్తోంది. ఇక నటుడుగా తన కెరీర్‌ను ప్రారంభించిన వరుణ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. మొదట్లో కథల విషయంలో తడబడిన.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. దీంతో వరుస విజయాలను వరుణ్ సొంతం చేసుకుంటున్నాడు. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న తాజా చిత్రం నుంచి మోషన్ పోస్టర్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ పోస్టర్‌లో వరుణ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జిటిక్ లుక్‌లో కేకపెట్టిస్తున్నాడు.

    ఇక ఈ చిత్రంపేరును గనిగా ఖారారు చేసారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నాడు వరుణ్. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు.






    ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినా.. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’ సినిమాతో మొదలైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఆ సినిమాలో వరుణ్ తన నటనతో అదరగొట్టాడు. ఆ తర్వాత మరో ప్రయోగం కంచె. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించాడు.



    ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి వరుణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ మధ్య పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ వంటి రఫ్ పాత్ర చేసి మరో కోణం చూపించాడు. ఇక ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ 'f2' సినిమాలు వరుణ్ కెరీర్‌కు మంచి మైలేజ్‌ను ఇచ్చాయి. ఇక ఆ మధ్య ‘గద్దలకొండ గణేష్’ అంటూ ఊరమాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టాడు వరుణ్.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Niharika konidela, Tollywood news, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు