• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIHARIKA KONIDELA JONNALAGADDA STYLE QUOTIENT AFTER MARRIAGE TA GH

Niharika: అక్కడ అదరగొడుతున్ననిహారిక.. పెళ్లి తర్వాత కూడా తగ్గని మెగా డాటర్ దూకుడు..

Niharika: అక్కడ అదరగొడుతున్ననిహారిక.. పెళ్లి తర్వాత కూడా తగ్గని మెగా డాటర్ దూకుడు..

పెళ్లి తర్వాత తగ్గని నిహారిక దూకుడు (Instagram/Photo)

Niharika Konidela Jonnalagadda : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తరువాత కూడా చురుగ్గా తన లేటెస్ట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు.

  • Share this:
Niharika Konidela Jonnalagadda : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తరువాత కూడా చురుగ్గా తన లేటెస్ట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) 1.8 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. కళ్లు చెదిరే చీరల్లో కనిపిస్తున్న నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికా సరికొత్తగా కనిపిస్తోంది. అంతేకాదు మెగా కుటుంబం (Mega family) నుంచి వచ్చిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించిన నిహారిక.. పలు వెబ్ సిరీస్ లతో సందడి చేసింది. టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక వెస్ట్రన్ వేర్ తో పాటు చీరల్లో కనిపిస్తూ మెగా అభిమానులను అలరిస్తుంటారు.

ఈ నెల 9న నిహారిక పెళ్లి చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. ఈ పెళ్లిలో నిహారిక 32 ఏళ్ల నాటి తన తల్లి పెళ్లి నాటి చీరలో మెరిసిపోయింది. దానికి సంబంధించిన నిహారిక పోస్ట్ చేసిన ఫొటో ఏకంగా 504,148 లేకులు కొల్లగొట్టిందంటే ఎంత అందంగా నిహారికా ఈ చీరకట్టులో కనిపించారో అర్ధం చేసుకోవచ్చు.



కర్లీ హెయిర్ తో స్మైలింగ్ , చార్మింగ్ గా కనిపిస్తున్న నిహారికా కట్టిన రెడ్ రఫుల్ చీరలో ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఈ జార్జిట్ చీరలో ఆమె అందం మరింత పెరిగినట్టు నిహారికా ఫాలోయర్స్ ప్రశంసలు కురిపించారు. నవంబర్ 4న పోస్ట్ చేసిన ఈ లుక్ తో ఈమె 197,547 లైకులు సొంతం చేసుకున్నారు.




ఆ తర్వాత నిహారిక కళ్లు చెదిరేలా కనిపించే బంగారు వర్ణం కంచి పట్టుచీరలో నిహారికా కనిపించి కనువిందు చేసారు. చైతన్యను మనువాడే సమయంలో ఈమె అత్యంత ఖరీదైన చీరతో సరికొత్తగా కనిపించారు.




కోడలిగా మెట్టింట వంట చేస్తూ... జొన్నలగడ్డ వారింట అడుగు పెట్టిన నిహారిక ఈ సందర్భంగా తీసుకున్న ఫొటో కూడా చాలా బాగుందని మెగా అభిమానులు ప్రశంసలు కురిపించారు. సింపుల్ చీర కట్టుకుని, సంప్రదాయకరంగా కనిపిస్తున్న నిహా.. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.




సూపర్ యాక్సెసరీస్..

మంచి డిజైనర్ వేర్ చీరలతో పాటు వాటికి తగ్గట్టు, ట్రెండీగా కనిపించేలా సూటబుల్ యాక్సెసరీస్ ధరించే మెగా ప్రిన్సెన్ నిహారిక వావ్ అనిపించేలా బొటిక్ డిజైన్ బ్లౌజులు ధరిస్తూ, తన ఫ్యాషన్ టేస్ట్ ను ఎప్పటికప్పుడు చాటుకుంటారు.




ప్రస్తుతం నిహారిక తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

అగ్ర కథనాలు