Home /News /movies /

NIHARIKA KONIDELA JONNALAGADDA SHARES VALENTINES DAY SPECIAL PHOTO ON INSTAGRAM GEOS VIRAL ON SOCIAL MEDIA TA

Niharika: వాలెంటైన్స్ డే రోజున అద్భుతమైన పిక్‌ను షేర్ చేసిన నిహారిక.. సోషల్ మీడియాలో వైరల్..

నిహారిక చైతన్య జొన్నలగడ్డ (Niharika Chaitanya Jonnalagadda)

నిహారిక చైతన్య జొన్నలగడ్డ (Niharika Chaitanya Jonnalagadda)

Niharika Konidela Jonnalagadda |  వాలెంటైన్స్ డే రోజున అద్భుతమైన పిక్‌ను షేర్ చేసిన నిహారిక.. ఇపుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Niharika Konidela Jonnalagadda |  వాలెంటైన్స్ డే రోజున అద్భుతమైన పిక్‌ను షేర్ చేసిన నిహారిక.. ఇపుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాల్డ్ వైడ్‌గా ప్రేమికుల దినోత్సవాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత తొలి సారి భర్తతో వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు ప్రేమికుల రోజు సందర్భంగా ఈ కొత్త దంపతులు పలు టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతేకాదు తమ పెళ్లి గురించి  పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిహారిక పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ తన భర్త‌ను కలిసి హానీమూన్‌ వెకేషన్స్‌ను సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ మద్య నిహారిక.. కొత్త సినిమాలు చూడటమే కాదు.. ఆయా సినిమాలకు తనదైన శైలిలో రివ్యూలు గట్రా ఇస్తోంది. ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. 

    ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) 1.9 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. ఆ సంగతి పక్కన పెడితే.. వాలెంటైన్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇపుడు నెటింట్లో వైరల్ అవుతోంది.



    ఈ ఫోటోలో ఒక గుమ్మటం రెండు చీలి ప్రేమికులను తలిపిస్తోన్న ఈ ఫోటో ఇపుడు సామాజిక మాధ్యమాల్లో నిహారిక ఫాలోవర్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన 7 గంటల్లో దాదాపు 64 వేల మంది దాకా తెగ లైక్ చేసారు. అంతేకాదు ప్రేమికుల రోజున అద్భుతమైన ఫోటో షేర్ చేసిన నిహారిక టేస్ట్‌ను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. అంతేకాదు పెళ్లి తర్వాత నిహారికకు ఇదే ఫస్ట్ వాలెంటైన్స్ డే కావడం విశేషం.

    భర్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక (Instagram/Photo)


    నిహారిక, చైతన్యల పెళ్లి గతేడాది  డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అందరు హాజరయ్యారు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ నుంచి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత నిహారిక తన భర్త కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది. అంతేకాదు టాలెంట్ ఉన్న దర్శకులతో వెబ్ సిరీస్‌లను నిర్మించడమే కాదు అందులో యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని కథలను ఓకే చేసారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chaitanya Jonnalagadda, Niharika konidela, Tollywood, Valentines Day 2021

    తదుపరి వార్తలు