• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIHARIKA KONIDELA JONNALAGADDA CHAITANYA TAKEN SENSATIONAL DECISION AFTER MARRIAGE TA

Niharika: పెళ్లి తర్వాత నిహారిక, చైతన్యల సంచలన నిర్ణయం.. ఇక పై ఆ రూట్లో వెళ్లాలనుకుంటున్న కొత్త జంట..

Niharika: పెళ్లి తర్వాత నిహారిక, చైతన్యల సంచలన నిర్ణయం.. ఇక పై ఆ రూట్లో వెళ్లాలనుకుంటున్న కొత్త జంట..

నిహారిక, జొన్నలగడ్డ చైతన్య (Instagram/Photo)

Niharika konidela Jonnalagadda Chaitanya | మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహాం చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే కదా. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట సరికొత్త నిర్ణయం తీసుకున్నారట.

  • Share this:
    Niharika konidela Jonnalagadda Chaitanya | మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహాం చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా ఈ నెల 9న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు వేసి ఈ పెళ్లిని ఎంతో అట్టహాసంగా జరిపించారు మెగా కుటుంబ సభ్యులు. మ్యారేజ్ తర్వాత  కొణిదెల వారి అమ్మాయి కాస్తా.. జొన్నలగడ్డ కోడలైంది. రీసెంట్‌గా ఈమె తన పుట్టినరోజు వేడుకలను తన పుట్టింట్లో కాకుండా మెట్టినింట్లో తన భర్తతో జరుపుకోవడం విశేషం. ఈ మధ్య ఎక్కడ చూసిన వీళ్లిద్దరే కనబడుతున్నారు. పెళ్లి ముందు వరకు కొన్ని సినిమాలు చేసిన నిహారిక.. ఇపుడు మ్యారేజ్ తర్వాత కూడా తన కెరీర్‌‌ను కంటిన్యూ  చేయాలనే ఆలోచనలో ఉందట. దానికి భర్త చైతన్య కూడా ఓకే చెప్పినట్టు  సమాచారం.

    కానీ నిహారిక తన కెరీర్‌ను నటిగా కాకుండా.. ఇపుడు నిర్మాతగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే నిహారిక తన భర్త చైతన్యతో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయనున్నారట. సంక్రాంతి తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఆహా ఓటీటీకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొంత మంది కొత్త దర్శకులు చెప్పిన లైన్‌కు వీళ్లిద్దరు త్వరలోనే ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ జంట హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొత్త ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన పనులను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట కొత దంపతులు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు