HOME »NEWS »MOVIE »niharika konidela husband chaitanya jonnalagadda gives clarity on his cinema entry mnj

Niharika- Chaitanya: సినిమాల్లోకి నిహారిక భ‌ర్త‌.. క్లారిటీ ఇచ్చిన చైత‌న్య‌

Niharika- Chaitanya: సినిమాల్లోకి నిహారిక భ‌ర్త‌.. క్లారిటీ ఇచ్చిన చైత‌న్య‌
భర్త చైతన్యతో నిహారిక కొణిదెల (Instagram/Photo)

Niharika- Chaitanya: మెగా డాట‌ర్ నిహారిక గ‌తేడాది చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్ర‌భాక‌ర్‌ కుమారుడైన చైత‌న్య‌.. ప్ర‌స్తుతం ఓ పేరు మోసిన‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. అయితే నిహారిక తన‌కు కాబోయే వాడంటూ చైత‌న్య‌ను ప‌రిచ‌యం చేసిన‌ప్ప‌టి నుంచి అత‌డి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపారు.

  • Share this:
    Niharika- Chaitanya: మెగా డాట‌ర్ నిహారిక గ‌తేడాది చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. గుంటూరు ఐజీ ప్ర‌భాక‌ర్‌ కుమారుడైన చైత‌న్య‌.. ప్ర‌స్తుతం ఓ పేరు మోసిన‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తున్నారు. అయితే నిహారిక తన‌కు కాబోయే వాడంటూ చైత‌న్య‌ను ప‌రిచ‌యం చేసిన‌ప్ప‌టి నుంచి అత‌డి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపారు. ఈ క్ర‌మంలో చైత‌న్య గురించి చాలా విష‌య‌లే తెలిశాయి. చైత‌న్యకు ఫొటోగ్ర‌ఫీ అంటే చాలా ఇష్టం. అలాగే త‌ర‌చుగా టూర్ల‌కు వెళుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే నిహారిక‌తో పెళ్లైన త‌రువాత చైత‌న్య హీరోగా వ‌స్తాడంటూ చాలా పుకార్లే వినిపించాయి. చిరంజీవి కుమార్తె శ్రీజ‌ను పెళ్లి చేసుకున్న త‌రువాత క‌ల్యాణ్ దేవ్ సినిమాల్లోకి రాగా.. అదే త‌ర‌హాలో చైత‌న్య కూడా వ‌స్తాడ‌ని.. ఇప్ప‌టికే స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు చైత‌న్య‌.

    మీరు సినిమాల్లోకి రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో నిజ‌మెంత.. మీరు, నిహారిక క‌లిసి న‌టిస్తారా.. అన్న ప్ర‌శ్న‌కు చైత‌న్య స్పందించాడు. త‌న‌కు అలాంటి ఆలోచ‌న‌లు ఏం లేవ‌ని ఈ మెగా అల్లుడు క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న ఆలోచ‌న‌లు వేర‌ని, సినిమాల్లో న‌టించాల‌ని లేద‌ని స్ప‌ష్టం చేశారు.



    అయితే ఈ ప్ర‌శ్న వేసిన స‌మ‌యంలో చాలా మంది మీమ‌ర్లు ఈ స‌మాధానం కోసం ఎదురుచూస్తున్నారు. నువ్వు ఒక క్లారిటీ ఇవ్వు అని నిహారిక చెప్ప‌డం విశేషం. మ‌రి వెడ్డింగ్ టీజ‌ర్‌లో అంత బాగా పోజులు ఇచ్చారు అన్న ప్ర‌శ్న‌కు.. త‌న‌కు సాధార‌ణంగా కెమెరా భ‌యం లేద‌ని, అందుకే ఫొటోలు, వీడియోల్లో అంత బాగా వ‌చ్చి ఉండ‌వ‌చ్చున‌ని చైత‌న్య తెలిపారు.
    Published by:Manjula S
    First published:February 23, 2021, 11:22 IST