• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NIHARIKA KONIDELA HAS GIVEN CLARITY ABOUT HUSBAND CHAITANYA JONNALAGADDA CINE ENTRY MHN

Niharika Konidela: భర్త సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన నిహారిక కొణిదెల

Niharika Konidela: భర్త  సినీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన నిహారిక కొణిదెల

Niharika Konidela has given clarity about husband Chaitanya Jonnalagadda cine entry

Niharika Konidela: మెగా అల్లుడు..నిహారిక భర్త చైతన్య సినీ రంగ ప్రవేశం గురించి చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రీసెంట్ ఇంటర్వ్యూలో నిహారిక క్లారిటీ ఇచ్చింది

  • Share this:
    తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మెగా హీరోలు ఉన్నంత సంఖ్య‌లో మ‌రో ఫ్యామిలీ హీరోలు లేర‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఓ క్రికెట్ టీమ్‌లా మెగా కుటుంబానికి చెందిన హీరోలున్నారు. రీసెంట్‌గానే వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. అయితే ఎప్ప‌టి నుంచో అంద‌రిలో మొద‌లుతున్న ప్ర‌శ్న‌.. ముఖ్యంగా నిహారిక పెళ్లి త‌ర్వాత‌. నిహారిక భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ సినిమా ఎంట్రీ ఎప్పుడు? అని. నిహారిక త‌న పెళ్లి గురించి చెబుతూ చైత‌న్య ఫొటోను రివీల్ చేయ‌గానే కుర్రాడు బావున్నాడు. ఈయ‌న కూడా మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌ను అనుస‌రిస్తూ సినీ ఎంట్రీ ఇవ్వ‌డం ప‌క్కా అని అంద‌రూ అనుకున్నారు.

    అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు నిహారిక కొణిదెల త‌న‌దైన స్టైల్లో స‌మాధానం చెప్పి అంద‌రికీ క్లారిటీ ఇచ్చేసింది. రీసెంట్ ఇంటర్వ్యూలో తన భర్త చైతన్య సినీ రంగ ప్రవేశం గురించి నిహారిక మాట్లాడుతూ ‘‘చైతన్యకు సినిమాలంటే చాలా ఇష్టం. అలాగని తను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని కాదు. తను సినిమాలను చూడటానికి బాగా ఇష్టపడతాడు. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉంటేనే యాక్టర్ అవుతాడు. చైతన్యకు అలాంటి ఆసక్తి లేదు’’ అని చెప్పేసింది.

    గత ఏడాది నిహారిక, చైతన్య జొన్నలగడ్డ పెళ్లి రాజస్థాన్‌లో ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. చైతన్య జొన్న‌ల‌గ‌డ్డ బేసిగ్గా టెక్ మ‌హేంద్ర జాబ్ చేస్తున్నాడు. మ‌రి ఉద్యోగం వ‌దిలేసి చైత‌న్య సినిమాల్లోకి వ‌స్తాడా? అనే దానిపై ఇప్పుడైతే నిహారిక స‌మాధానం చెప్పేసింది కానీ.. భ‌విష్య‌త్తులో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌లేం.
    Published by:Anil
    First published: