అన్నయ్యతో కలిసి నటించడంపై నిహారిక స్పందన ఇది..

మెగా కుటుంబం నుండి తొలిసారి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సంచలనం క్రియేట్ చేసింది నిహారిక. ఇక మెగా బ్రాండ్ అనే ఇమేజ్‌తో నిహారిక అనుకున్నంత రేంజ్‌లో కథానాయికగా సక్సెస్ కాలేకపోయింది. తాజాగా ఈమె అన్నయ్యతో కలిసి నటించే విషయమై ఓపెన్ అయింది.

news18-telugu
Updated: May 2, 2020, 4:59 PM IST
అన్నయ్యతో కలిసి నటించడంపై నిహారిక స్పందన ఇది..
నిహారిక కొణిదెల (Instagram/Photo)
  • Share this:
మెగా కుటుంబం నుండి తొలిసారి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన సంచలనం క్రియేట్ చేసింది నిహారిక. ఇక మెగా బ్రాండ్ అనే ఇమేజ్‌తో నిహారిక అనుకున్నంత రేంజ్‌లో కథానాయికగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈమెకు కథానాయికగా అవకాశాలు తగ్గిన వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది. గతేడాది చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో అడవి పిల్ల పాత్రలో నటించిన నిహారిక ఇపుడు మరోసారి పెదనాన్న చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న ఆచార్యలో ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా వస్తోన్న ఈ పుకార్లపై నిహారిక స్పందించింది. ఈ చిత్రంలో నేను నటిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఇందులో నేను రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటించడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల కథలు విన్నా.. దేనికి ఓకే చెప్పలేదంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్  వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఎపుడు రిలీజ్ అనేది కరోనా  ఎఫెక్ట్ పై ఆధారపడి ఉంది.
First published: May 2, 2020, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading