Home /News /movies /

NIHARIKA KONIDELA CHIRANJEEVI VARUN TEJ SHARES ADORABLE PIC WITH BIG UNCLE MEGASTAR CHIRANJEEVI AND SISTER NIHARIKA GOES VIRAL ON SOCIAL MEDIA TA

Niharika - Chiranjeevi: చిరంజీవితో చిన్ననాటి నిహారిక, వరుణ్ తేజ్ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్..

చిన్నారి నిహారిక, వరుణ్ తేజ్‌లతో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

చిన్నారి నిహారిక, వరుణ్ తేజ్‌లతో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

Niharika - Chiranjeevi: నిహారికతో పాటు పెదనాన్న చిరంజీవితో చిన్ననాటి ఫోటోను ఫ్యాన్స్‌తో పంచుకున్న వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ ఫోటోను మెగాభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    Niharika - Chiranjeevi: నిహారికతో పాటు పెదనాన్న చిరంజీవితో చిన్ననాటి ఫోటోను ఫ్యాన్స్‌తో పంచుకున్న వరుణ్ తేజ్. ప్రస్తుతం ఈ ఫోటోను మెగాభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చిన్నారి నిహారికను చిరంజీవి ఎత్తుకున్నపుడు .. పక్కనే వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇపుడీ  ఫోటో వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో  షేర్ చేశాడు. నిహారిక విషయానికొస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ సంచలనం రేపింది. అంతేకాదు తనదైన చిత్రాలతో అభిమానులను అలరించడమే కాదు. పెదనాన్న చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో నిహారిక పెళ్లి మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది.  పెళ్లి తర్వాత నిహారిక మళ్లీ వెబ్ సిరీస్‌లతో బిజీ అయింది.

    మరోవైపు వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన ‘గని’ సినిమాతో పాటు ఎఫ్ 3 సినిమాలు ఈ యేడాదే విడుదల కానున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వచ్చే నెల మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు దర్శకుడు మోహన్ రాజాతో చేస్తోన్న ‘లూసీఫర్’ రీమేక్ ‘రారాజు’ కూడా ఈ యేడాదే విడుదల కానున్నట్టు సమాచారం. మొత్తంగా మరోవైపు ఏప్రిల్ 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

    సోషల్ మీడియాలో ఎపుడు యాక్టివ్ గా ఉండే నిహారిక పెళ్లి తరువాత కూడా చురుగ్గా తన లేటెస్ట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) 2 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Niharika konidela, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు