Niharika Konidela Chaitanya Jonnalagadda Marriage | మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక వివాహాం చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు వేసి ఈ పెళ్లిని ఎంతో అట్టహాసంగా జరిపించారు మెగా కుటుంబ సభ్యులు. కాసేటి క్రితమే 7 గంట 15 నిమిషాలకు మిథున లగ్నంలో వేద పండితులు నిర్ణయించిన ముహూర్తంలో వీరి పెళ్లి జరిగింది. నిహారిక మ్యారేజ్ కోసం మెగా కుటుంబం మొత్తం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌కు తరలి వెళ్లింది. గత వారం పది రోజుల నుంచి మెగా డాటర్ పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది అతిథులు హాజరయ్యారు. ఇప్పటికే నిహారిక పెళ్లిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేసారు. అంతేకాదు పెళ్లికి ముందు సంగీత్‌లో వీళ్లు వివిధ పాటలకు చిందులు వేసారు. మరోవైపు నిహారిక పెళ్లిలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్, కూతురు ఆద్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
నిహారిక పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు. నిహారిక పెళ్లి చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఈయన గుంటూరు ఐజీ ప్రభాకర రావు తనయుడు. ఈ పెళ్లికి రాలేని వారికి ఇతర బంధుమిత్రులకు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనుంది కొణిదెల కుటుంబం. మొత్తంగా కుటుంబ సభ్యులు మధ్య వివాహాం చేసుకున్న నిహారిక, చైతన్య దంపతులకు మెగాభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 09, 2020, 19:45 IST