Niharika: కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా నిహారిక నిశ్చితార్ధం.. పెళ్లి డేట్ ఎపుడంటే..

నిహారిక కొణిదెల నిశ్చితార్ధంలో రామ్ చరణ్, ఉపాసన (Instagram/Photo)

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. ఈ రోజు నిహారిక ఎంగేజ్మెంట్ చైతన్య జొన్నలగడ్డతో ఎంతో సింపుల్‌గా జరిగింది.

 • Share this:
  తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. రీసెంట్‌గా రానా, తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా మెడలో మూడు ముళ్లు వేసాడు.  తాజాగా టాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా మోగనుంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. పెళ్లి కన్ఫర్మ్ అయినా డేట్స్ మాత్రం ఇంకా కుదర్లేదు. తాజాగా ఈ రోజు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులతో పాటు సాయి ధరమ్ తేజ్ో వంటి కొంత మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక నిశ్చితార్ధం (పూలు పండ్లు) ఈ రోజు ఎంతో సింపుల్‌గా జరిగింది. వేద పండితులు ఈ నిశ్చితార్ధపు తంతును శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు తాంబూలాలు మార్చుకున్నారు.

  నిహారిక కొణిదెల నిశ్చితార్ధం (Instagram/Photo)


  వెంకట చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఈయన  గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు.  ప్రస్తుతం.. ఈయన పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిహారిక పెళ్లి సంబంధాన్ని పెదనాన్న చిరంజీవి ముందుండి చేసాడు.  ఎన్నాళ్ల నుంచో తెలిసిన కుటుంబాన్ని తన తమ్ముడి కూతురుకు కలుపుకున్నాడు మెగాస్టార్. పెళ్లి కుదిరిన తర్వాత చైతన్య, నిహారిక జంట సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులతో సందడి చేస్తున్నారు. తాంబూలాలు పూర్తి కావడంతో ఇపుడు పెళ్లి డేట్ ఎపుడేదనేది త్వరలోనే  అఫీషియల్‌గా  ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే కార్తీకం కానీ లేదా మార్గశిర మాసం అంటే అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయని  మెగాకుటుంబ సభ్యులు చెబుతున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: