మెగా డాటర్ నిహారిక గతేడాది చైతన్యను వివాహం చేసుకొని కొత్త మెుదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కొత్త సంసారం అనుభావాలను వాలెంటెన్స్ సందర్భంగా పలు ఇంటార్వ్యూలో పంచుకుంది
మెగా డాటర్ నిహారిక గతేడాది చైతన్యను వివాహం చేసుకొని కొత్త ఇన్నింగ్స్ మెుదలు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సంసారం అనుభావాలను వాలెంటెన్స్ సందర్భంగా పలు ఇంటార్వ్యూలో పంచుకున్నారు. పుట్టింట్లో అలవాటు పడ్డ వాటిని మెట్టినింట్లో మార్చుకోవడం చాలా కష్టంగా ఉందని తెలిపింది. తను ఇంట్లో ఎంత సేపు పడుకుని ఉన్నప్పటికి ఎవరూ లేపేవారు కాదని.. అయితే పెళ్లయ్యాక కూడా ఆ విషయంలో కంఫర్ట్‌గా ఉన్నానంటూ కాస్త మొహమాటంగా చెప్పింది. అంటే అత్తారింటిలో అడుగుపెట్టక పాత ఆలవాట్లను మార్చుకోవడం కష్టంగానే ఉందని చెప్పకనే చెప్పింది. అలాగే తన తండ్రికి (నాగబాబు) కూడా ఇక్కడ ఇలా అలవాటు పడ్డ అమ్మాయి అక్కడే ఎలా ఉండగలుగుతుందో అని కొంచెం భయం ఉండేదని.. ఆ ఇంటార్వ్యూలలో వివరించింది.
మెగా డాటర్ నిహారిక గతేడాది చైతన్య జొన్నలగడ్డను ఉదయపూర్ ప్యాలేస్ వేదికగా అంగరంగ వైభంగా వివాహం చేసుకుంది. తన చిన్నప్పటి క్లాస్‌మెట్, గుంటూరు ఐజీ ప్రభాకర్ కుమారుడైన చైతన్య.. ప్రస్తుతం ఓ పేరు మోసిన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే నిహారిక తనకు కాబోయే వాడంటూ చైతన్యను పరిచయం చేసినప్పటి నుంచి అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపారు. ఈ క్రమంలో చైతన్య గురించి చాలా విషయలే తెలిపింది. చైతన్యకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అలాగే తరచుగా టూర్లకు వెళుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే నిహారికతో పెళ్లైన తరువాత చైతన్య హీరోగా వస్తాడంటూ చాలా పుకార్లే వినిపించాయి. చిరంజీవి కుమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న తరువాత కల్యాణ్ దేవ్ సినిమాల్లోకి రాగా.. అదే తరహాలో చైతన్య కూడా వస్తాడని.. ఇప్పటికే స్క్రిప్ట్‌లు కూడా వింటున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని తెల్చిచెప్పేశాడు
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.