Niharika Marriage: నిహారిక, చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్... అదిరిపోయే లెవల్లో ప్లాన్ చేసిన మెగా ఫ్యామిలీ..

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ (Instagram/Photo)

Niharika Kpnidela Chaitanya Jonnalagadda Marriage Date fix: నిహారిక, చైతన్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తంతో పాటు పెళ్లి వేదిక కూడా ఖరారైంది.

  • Share this:
    Niharika Kpnidela Chaitanya Jonnalagadda Marriage Date fix: నిహారిక, చైతన్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిల సీజన్ నడుస్తోంది. హీరోలు, హీరోయిన్లు,  దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా  ఒకరి తర్వాత ఒకరు మూడు ముళ్ల బంధంతో ఒకటైవుతున్నారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇపుడు నిహారిక, చైతన్యల పెళ్లికి మూహూర్తం ఖరారైంది. ఇప్పటికే నిహారిక, చైతన్యల నిశ్చితార్ధ వేడుక ఆగష్టు 13న ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక, చైతన్యలకు సంబంధించిన పెళ్లి తేది ఖరారైనా.. పెళ్లి వేడుకను ఎక్కడ నిర్వహిస్తారనేడి సస్పెన్స్‌గా మారింది. చైతన్య జొన్నలగడ్డతో మెగా డాటర్ నిహారిక కొణిెదల వివాహాం.. డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఖరారైంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగునున్నట్టు నిహారకి కొణిదెల కన్ఫామ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.




    రాజస్థాన్‌లో ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్యల పెళ్లికి ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీఠలపై వీరి పెళ్లి వేద మంత్రాల మధ్య ఐదు రోజులు జరగనుంది. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్ధం వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత పెళ్లి పనుల్లో అత్యంత ముఖ్యమైన పసుపు దంచే కార్యక్రమం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. చైతన్య తండ్రి ప్రభాకర రావు గుంటూరు రేంజ్ ఐజీ అన్న సంగతి తెలిసిందే కదా. చైతన్య విషయానికొస్తే.. ఈయన హైదారాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఈయన చదువు పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో లెక్కల్లో మాస్టర్ డిగ్రీ చేసాడు. అంతేకాదు హైదరాబాద్‌కు చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: