news18-telugu
Updated: December 1, 2020, 11:00 PM IST
నిహారిక పెళ్లి పత్రిక
కొణిదెల వారింట పెళ్లి బజాలు మోగడానికి సర్వం సన్నద్ధమవుతుంది. మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లికి అన్నీ హంగులు పూర్తికావస్తున్నాయి. గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో జరగనుంది. పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లనున్నారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో వివాహ రిసెప్షన్‌ను ఇవ్వనున్నారని సమాచారం. డిసెంబర్ 9న జరగబోయే పెళ్లి పనులను నిహారిక, ఆమె అన్నయ్య హీరో వరుణ్ తేజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నిహారిక కొణిదెల నటిగా అందరికీ సుపరిచితురాలే. నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై ఈ వెబ్ సిరీస్‌లను నిర్మించారు కూడా. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆమె నాగశౌర్యతో కలిసి ఒక మనసు, రాహుల్ విజయ్‌తో సూర్యకాంతం, విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీక్‌తో కలిసి ఒరు నెల్ల నాల్ పాత్తు సొల్రన్ వంటి సినిమాల్లో నటించారు. చిరంజీవి టైటిల్ పాత్ర పోషించిన సైరా నరసింహారెడ్డిలోనూ నిహారిక ఓ చిన్న పాత్రలో నటించారు. తదుపరి అశోక్ సెల్వన్‌తో కలిసి ఓ సినిమాలో నిహారిక నటిస్తుందని వార్తలు వినిపించాయి కూడా. అయితే చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుండి నిహారిక తప్పుకుంది. పెళ్లి నిశ్చయం కావడంతోనే నిహారిక తమిళ సినిమా నుండి డ్రాప్ అయినట్లు కూడా వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి.
వెంకట చైతన్య జొన్నలగడ్డ టెక్ మహేంద్రలో ఉద్యోగం చేస్తున్నారు. ఆగస్టులోనే రెండు కుటుంబాలు కలిసి వీరికి నిశ్చితార్థం చేశారు. ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తామని ఓ ఇంటర్వ్యూలో నిహారిక తండ్రి, నటుడు నాగేంద్ర బాబు తెలియజేశారు. నిశ్ఛితార్థం తర్వాత కాబోయే భర్తతో నిహారిక కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ వచ్చింది. వీలుకన్నప్పుడల్లా చైతన్యపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది నిహారిక.

తన కాబోయే భర్త చైతన్యతో నిహారిక కొణిదెల
అలాగే ఈ ఏడాది కోవిడ్ ప్రభావంతో ఈ ఏడాది సినీ సెలబ్రిటీలు రానా, నిఖిల్, నితిన్ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మెగా కుటుంబం నిహారిక పెళ్లిని ఎలా చేస్తారోనని అందరూ అనుకున్నారు. అయితే సింపుల్‌గా కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిహారికన, చైతన్యల డెస్టినేషన్ మ్యారేజే చేయడానికి రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు.
Published by:
Anil
First published:
December 1, 2020, 10:53 PM IST