అలాంటి పాత్రల్లో కనిపించడానికి రెడీ అంటోన్న నిహారిక..

Niharika Konidela : నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న ముద్దుగుమ్మ.

news18-telugu
Updated: May 30, 2020, 7:19 AM IST
అలాంటి పాత్రల్లో కనిపించడానికి రెడీ అంటోన్న నిహారిక..
నిహారిక కొణిదెల Photo : Instagram
  • Share this:
Niharika Konidela : నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోంది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు' పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. నిహారిక ఇటీవల చిరంజీవి 'సైరా' సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై మంచి  అంచనాలతో వస్తున్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. దీంతో ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటోంది నిహారిక. అందులో భాగంగా తాజాగా ఓ తమిళ చిత్రానికి నిహారిక ఓకే చెప్పింది. జాతీయ పురస్కార గ్రహీత సుశీంద్రన్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన స్వాతి అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రంలో నిహారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో 'పిజ్జా' ఫేమ్‌ అశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించనున్నాడు. రొమాంటిక్‌ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. తమిళంలో నిహారికకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు విజయ్‌ సేతుపతి సరసన 'ఒరు నల్ల నాల్‌ పాతు సొల్రేన్‌' అనే సినిమా చేసింది. ఇక ఇటీవల నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రొమాంటిక్ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: May 30, 2020, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading