ఇస్మార్ట్ శంకర్ పోరికి రాముడులాంటి మొగుడే కావాలట..

Nidhhi Agerwal: ఇక తనకు ఫ్లవర్స్, ఖరీదైన డిన్నర్ వద్దన్న నిధి అగర్వాల్.. ఇంటి వద్ద పిజ్జాలు తినకుంటూ సినిమా చూడలని.. ఇదే తన డ్రీమ్ డేట్ అని చెప్పుకొచ్చింది.

news18-telugu
Updated: October 18, 2019, 6:40 PM IST
ఇస్మార్ట్ శంకర్ పోరికి రాముడులాంటి మొగుడే కావాలట..
నిధి అగర్వాల్
  • Share this:
''ఆరడుగుల అందగాడై ఉండాలి. మంచి మనస్తత్వం ఉండి నన్ను అర్థం చేసుకోవాలి. జీవితంలో స్థిరపడి నన్ను బాగా చూసుకోవాలి.'' తమకు కాబోయే వాడి విషయంలో అమ్మాయిలు ఎక్కువగా పెట్టే కండిషన్లు ఇవి. సినిమా హీరోయిన్లు కూడా తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉంటారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ పోరి నిధి అగర్వాల్ కూడా తనకు కాబోయే వాడి గురించి మనసులో మాట చెప్పింది. లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా 'వూట్' ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైయ్యే 'ఫీటప్ విత్ స్టార్స్' కార్యక్రమంలో పాల్గొంది నిధి అగర్వాల్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకుంది.

ఇంటర్వ్యూకు వచ్చిన నిధి అగర్వాల్ అందాలను చూసి..వామ్మో నువ్వు చాలా హాట్ అంటూ కామెంట్ చేసింది మంచు లక్ష్మి. ఇంత చల్లగా ఉన్న ఏసీ రూమ్‌లో కూడా వేడెక్కిస్తున్నావంటూ సరదాగా వ్యాఖ్యానించింది. వెంటనే స్పందించిన నిధి.. మీరు కూడా హాటే అంటూ మంచు లక్ష్మిని పొగిడింది. డిస్కషన్ మధ్యలో కాబోయే భర్త ఎలా ఉండాలని మంచు లక్ష్మి అడగడంతో.. తనకు రాముడి లాంటి వ్యక్తి జీవిత భాగస్వామగా కావాలని మనసులో మాటను బయటపెట్టింది నిధి అగర్వాల్. తన జీవితంలో కృష్ణులాంటి వాళ్లు చాలా మందే ఉన్నారనడంతో మంచు లక్ష్మి పడిపడి నవ్వింది. ఇక తనకు ఫ్లవర్స్, ఖరీదైన డిన్నర్ వద్దన్న నిధి.. ఇంటి వద్ద పిజ్జాలు తినకుంటూ సినిమా చూడలని.. ఇదే తన డ్రీమ్ డేట్ అని చెప్పుకొచ్చింది.
Published by: Shiva Kumar Addula
First published: October 18, 2019, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading